మూడ్రోజులుగా లాకర్స్‌ను తెరిచి పరిశీలిస్తున్న అధికారులకు షాక్ తగులుతోంది. ఎందుకంటే.. వందలకొద్ది అట్టపెట్టెల్లో నగదును దాచి పెట్టారట. అలాగే బీరువాల్లోనూ నగదు కుక్కి కుక్కి దాచారట. అలా దాచిందంతా రూ. 500 నోట్ల కట్టలే కావడం విశేషం. ఇలా పదుల సంఖ్యలో డబ్బుతో కూడిన ఇనుప బీరువాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు.