ఒకప్పుడు పాలమూరు జిల్లా అంటే సురవరం ప్రతాప రెడ్డి, బూర్గుల రామకృష్ణ రావు, మల్లు ఆనంత రాములు, మల్లికార్జున్ గౌడ్, జైపాల్ రెడ్డి లాంటి మహనీయులు గుర్తొచ్చేవారి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఇదే జిల్లా నుంచి గువ్వలోడు, గుడ్లగూబలోడు ఎమ్మెల్యేలుగా ఉన్నారని.. భూ కబ్జాదారులు, ఇసుక దందాలు చేసేటోళ్లు పాలమూరు పరువు తీస్తున్నారని రేవంత్ రెడ్డి ఘాటు పదజాలం వాడారు.