ట్రాన్స్కో చెబుతున్న కొన్ని వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బొగ్గు కొరత కారణంగా ఏపీలో 2500 మెగావాట్లు మాత్రమే ఏపీ జెన్ కో ప్లాంట్లు ఉత్పత్తి చేయగలుగుతున్నాయని ఏపీ ట్రాన్స్కో ఓ ప్రకటనలో తెలిపింది. ఏపీ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతుందని.. కానీ.. ప్రస్తుతం కొరత కారణంగా సెప్టెంబరు నెలలో 24 వేల టన్నులు మాత్రమే సరఫరా అయ్యిందని తెలిపింది.