ఏడేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడి ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందనే చెప్పాలి. ప్రత్యేకించి ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ మిన్నగా కనిపిస్తోంది. జాతీయ సగటు కన్నా ఎక్కువ అభివృద్ధిని నమోదు చేస్తోంది. తెలంగాణ ఏర్పడిన ఏడేళ్లలో జీఎస్డీపీ రెట్టింపైంది.