ది గ్రేట్ రిజిగ్నేషన్..అంటే ఉద్యోగాలు వదిలేయడం.. అవును.. కరోనా తర్వాత ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందట. ఉద్యోగాలు చేయడం కంటే.. సొంత ఉపాధి వెతక్కోవడం పై కొందరు దృష్టి పెడుతున్నారట. మరికొందరు.. కొత్త ఉద్యోగం వెదుక్కుంటున్నారట. ఇలా ఉద్యోగాలకు రాజీనామా చేయడం కొన్ని దేశాల్లో సునామీ స్థాయిలో ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి.