టీటీడీ ఏం చెబుతోందంటే.. పెద్ద జీయంగార్, చిన జీయంగార్లు పాటిస్తూ అభిషేకాలు నిర్వహిస్తున్నారు.. ఆర్జిత బ్రహ్మోత్సవ వేళల్లో శ్రీవారిని మాడ వీధుల్లో ఊరేగించడం లేదని పిటిషనర్ చేసిన మరో ఆరోపణల్లో వాస్తవాలు లేవు. ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ ప్రజల కోసం టీటీడీ ప్రవేశపెట్టింది.. గరుడ, హనుమంత, శేష వాహనాలపై స్వామి వారిని కూర్చొపెట్టి ఎలాంటి ఊరేగింపు లేకుండా భక్తులకు దర్శనమిచ్చే విధంగా రూపొందించామని టీటీడీ తెలిపింది.