రైతులు ఆందోళన చేస్తున్న దిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతంలోని కుండ్లీ వద్ద ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. రైతులు నిరసన చేపట్టే వేదికకు దగ్గర్లోనే ఈ హత్య జరిగింది. హత్యకు గురైన వ్యక్తిని లాఖ్‌బీర్‌సింగ్ గా పోలీసులు గుర్తించారు. వేదిక దగ్గర ఉన్న ఓ బారికేడ్‌కు.. లాఖ్‌బీర్ మృతదేహం వేలాడేశారు. అయితే ఈ హత్యతో రైతు ఉద్యమం ఒక్కసారిగా మతం రంగు పులుముకుంటోంది.