రాహుల్‌గాంధీ ఇప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన అధ్యక్ష పీఠం ఎక్కే అంశం మరోసారి వాయిదా పడిందనే చెప్పాలి. ఎందుకంటే.. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక అంశాన్ని ఏఐసీసీ మరోసారి వాయిదా వేసింది. వచ్చే ఏడాదే సెప్టెంబర్‌లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం వస్తోంది.