తన చెల్లెలు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శక్తి సామర్థ్యాలను చూసి రాహుల్ గాంధీ భయపడిపోతున్నాడట. అందుకే ఆమెను 2017 ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థిగా ప్రియాంకను ప్రకటించలేదట. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.