ధ్వనితో పోలిస్తే కనీసం ఐదు రెట్లు వేగం అంటే గంటకు 6,200 కిలోమీటర్ల వేగంతో వెళ్తే దాన్ని హైపర్సోనిక్ క్షిపణి అంటారు. ఇప్పుడు చైనా సరికొత్తగా అందుకున్న ఈ పరిజ్ఞానంతో చైనా ఈ భూమి మీద ఉన్న ఏ ప్రాంతాన్నైనా.. తన క్షిపణులతో పేల్చే సత్తా సంపాదించుకున్నట్టు నిరూపణ అయ్యింది. ఇదే ఇప్పుడు అమెరికాకు కంటగింపుగా మారింది.