చైనా అధిక రాజ్యకాంక్ష గల దేశం అనేది "అమానవీయంగా అది టిబెట్టును దురాక్రమణ చేయటం" ద్వారానే ప్రపంచానికి తెలిసింది. ఇరుగు పొరుగు అనే భేదం లేకుండా దారుణ రాజ్యకాంక్ష ఆదేశాన్ని ముప్పిరి గొంటూ వస్తుంది. చైనా, దాని నైజం పరిశీలించకుండానే అర్ధమౌతుంది. ప్రతి పొరుగుదేశం తో దానికి సరిహద్దు సమస్యలే.
అంత పురాతన దేశమైనా దురాక్రమణలు చేస్తూ కొనసాగే దాన్ని అన్నీ దేశాలు నమ్మదగని దేశంగా, ఒక నమ్మలేని స్నెహితుని రూపములో దాగి కొనసాగే శత్రువుగా మార్చేసింది. ఏ ఒక్క పొరుగు దేశముతో కూడా చైనాకు నిజమైన సంభందాలు లేవు దాన్ని ఏ ఒక్క దేశం మనస్పూర్తిగా నమ్మదు, నమ్మలేదు. దేశం భారత ఉపఖండం విభజన తరవాత పాకిస్థాన్ తో ఏర్పడ్ద సమస్యల వల్ల పాక్ దురాక్రమణ వలన, చైనా పంచశీలను నమ్మి చైనా వలన చైనాతో మోసపోయిన భారత్, చైనాతో సరిహద్దు సమస్య లు తెచ్చుకుంది. శత్రువు శత్రువు మిత్రుడన్న నానుడిని యదార్ధం చేస్తూ “పాక్ స్నేహితుడై చైనా” భారత్ తో తన మైత్రి హితాన్ని మరచి భారత్ లాంటి శాంతికాముక దేశం తో వైరం కొనితెచ్చుకుంది.
తన సార్వభౌమాధికారాని ఏమాత్రం ప్రమాదమని భావించినా తానూర్కోననే చైనా ఇతరదేశాల సార్భౌమాధికారాలను ప్రమాదా ల్లో పడేస్తుంది. దేశ సరిహద్దు దేశాల మనోగతముతో సంబంధం లేకుండా తను రహదారులు, విధ్యుత్ ప్రోజెక్టులు, ఇంఫ్రా వ్యవస్థలూ నిర్మించుకొంటూ పోయే ప్రయత్నాలను ఎవరు అడ్డగించినా దాన్ని శత్రువుగా చూస్తూ దానిపై యుద్ధం ప్రకటించే స్వభావానికి భారత్ చెక్ పెట్టటం దానికి భరించలేని పరిస్థితిలోకి నెట్టేసింది. భారత్ జనాబాలో కాని, సంస్కృతి స్వభావాల్లో కాని చరిత్రలో కాని నాగరికతలో కాని చైనాకు సరైన సమాధానమివ్వగలదు. చైనా నియంతృత్వ పాలన నాయకత్వ మే దాన్ని సైనికంగా శతృదుర్భేధ్యంగా ప్రస్తుతాంకి మార్చింది. ఈ అణుప్రభావిత ప్రపంచంలో సైనికులతో మాత్రమే విజయం సాధించగలమనుకోటం సరిపోదు.
ప్రపంచదేశాలతో సంభంధ బాంధవ్యాలు చాలా అవసరం. వ్యూహాత్మక
ఒప్పందాలతో భారత్ యుద్ధం చేయటానికి సిద్దమై పోతుంది. కారణం చైనా దినదిన ప్రేలాపనలతో
భయపడుతూ భారత్ కాలమికగడపలేదు. యుద్దమంటూ వస్తే రెండుదేశాలు కాలగర్భంలో కలసిపోవాల్సిందె. అప్పుడు చైనాకు లేని భయం మనకెందుకనే
రీతిలో శాంతి మంత్రం మానేసి భారత్ యుద్ధానికి సై అంటే సై
అంటూ సిద్ధమైంది. ఇంతవరకు అసమర్ధ స్వార్ధ ప్రభుత్వాలతో అలసి సొలసిన భారత్
తనదైన శాంతినే కాదు సాహసాన్ని కూడా
ప్రపంచానికి రుచిచూపవలసిన తరుణం ఆసన్నమైనది.
భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత అంశంపై విదేశాంగ సెక్రటరీ జైశంకర్ మంగళవారం నాడు స్పందించారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులను భారత్ తొలిసారి ఎదుర్కోలేదని, గతంలోను ఎదుర్కొందని చెప్పారు. డోక్లామ్‌లో ఉద్రిక్త పరిస్థితిని భారత్ కచ్చితంగా సమర్థవంతంగా ఎదుర్కోగలదని ఆయన చెప్పారు. తనకు ఆ విశ్వాసం ఉందని తెలిపారు. గతంలోను ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నామని చెప్పారు. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించలేదని చెప్పడానికి ఒక్క కారణం కూడా కనిపించడం లేదన్నారు. భారత్ - చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉంటే అది ఆసియా పైన, ప్రపంచం పైన కూడా పడుతుందని చెప్పారు. భారత్ - చైనాలు విభేదాలను వివాదాలుగా మార్చుకోకూడదని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత్వం చోటు చేసుకుంటున్న పరిస్థితుల్లో ఇండో - చైనా సంబంధాలు ఎంతో ముఖ్యమని చెప్పారు.
సిక్కిం సరిహద్దులోని డోక్లాం కారణంగా భారత్-చైనాల మధ్య ప్రారంభమైన గొడవ రోజురోజుకు ముదురుతున్నా భూటాన్ మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పడం లేదు. అలాగని చైనాతో రాజీకి సిద్ధపడి, భారత్‌తో సంబంధాలను తెంచుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే భారత్‌తో ఆ దేశానికి ఉన్న సంబంధాలు అలాంటవి. సమస్య పరిష్కారం కావాలంటే భారత్‌తో సంబంధాలు తెంచుకోవాలని చైనా ఇచ్చిన ఆఫర్‌ను భూటాన్ తిరస్కరించింది. భారత్ తో స్నేహాన్ని వదిలేస్తే ఎన్ని వరాలు ఇవ్వటానికి చైనా సిద్ధమని చెప్పినా భూటాన్ చైనాని విశ్వసించటం లేదు కారణం చైనా గత చరిత్ర వెలిబుచ్చిన విశ్వాస రాహిత్యమే.
డోక్లాంలో చైనా నుంచి ప్రమాదం ఉండడంతో భారత్‌ను భూటాన్ విడిచిపెట్టే ప్రసక్తే లేదని భూటాన్ నిపుణుడు ఒకరు చెబుతున్నారు. డోక్లాం సహా వివాదాస్పద ప్రాంతాన్ని చైనా తనదిగా చెప్పుకుంటే హా, పారో, థింఫు లోయలు చైనా ఫిరంగుల లక్ష్యంలోకి వచ్చేస్తాయని చెబుతున్నారు. అంతేకాదు రాజధాని థింఫుకు దారితీసే రహదారిని చైనా ధ్వంసం చేసే ప్రమాదం ఉందంటున్నారు. ఫలితంగా భారత్ నుంచి ఆహార సరఫరాకు ఉన్న ఒకే ఒక మార్గం మూతపడుతుందని చెబుతున్నారు.
తూర్పు భూటాన్‌లోని 495 చ. కి.మీ., పశ్చిమ సెక్టార్‌లోని 286 చ.కి.మీ. తమవే నని చైనా వాదిస్తోంది. అయితే డోక్లాంను కనుక తమకు ఇచ్చేస్తే తూర్పు భూటాన్‌ను వదులుకోవడానికి తాము సిద్ధమని చైనా ఆఫర్ ఇచ్చింది. అదే జరిగితే చైనాకు భారత్‌పై ఆధిపత్యం చలాయించే అవకాశం లభిస్తుంది. అయితే చైనా ఆఫర్‌ను భూటాన్ అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. ఒకవేళ డోక్లాంను కనుక చైనాకు అప్పగిస్తే ఆ దేశ దళాలు భూటాన్‌లోని మరో ప్రాంతంలోకి చొరబడతాయని భూటాన్ భావిస్తోంది. ఇది మరింత ప్రమాదకరం కావడంతో భారత్‌తో ఉండేందుకే భూటాన్ సిద్ధపడుతోంది.