ఏది ధర్మం..ఏది న్యాయం..ఈ ఆలోచన మనిషికి అనాదిగా వస్తున్నదే.. ఓ కాలంలో న్యాయ సమ్మతమైనది మరో కాలంలో అధర్మంగా మారుతుంది. ఓ కాలంలో చాలా సహజం అనుకున్నది కాలక్రమేణా అరాచకంగా భావించవచ్చు. అలాంటి వాటిలో మనస్మృతి ఒకటి. వేల ఏళ్ల నాడు రాసిన ఈ మనుస్మృతిని ఇప్పుడు చదివితే మరీ ఇంత అన్యాయం ఉంటుందా అనిపించకమానదు. 

Image result for manu dharma sastram
కానీ అదే మనుస్మృతి ఇంకా ప్రామాణికమని నమ్మే మహానుభావులూ ఉన్నారు. మరి ఇంతకీ ఆ మనుస్మృతిలో ఏముంది.. ప్రత్యేకించి మహిళల విషయంలో మనువు ఏం చెప్పాడో ఓసారి పరిశీలిద్దాం.. " మగవాళ్లను చెడగొట్టటం ఆడవాళ్ల లక్షణం. కాబట్టి స్త్రీల స్నేహంలో మేధావులైన మగవారు ఎప్పుడూ క్షేమంగా ఉండరు. (మనుస్మృతి 2/213) . తెలివైన మగవారు తల్లితోనూ, చెల్లితోనూ, కూతురుతోను వంటరిగా కూర్చోకూడదు. భౌతిక కోర్కెలు బలమైనవి. దానివల్ల కోర్కెలకు వారు గురి కావచ్చు (మనుస్మృతి 2/215)

Image result for manu dharma sastram

ఎరుపురంగు జుట్టూ, ఎరుపు రంగు కళ్లూ, అధిక శరీరభాగాలు (ఆరు వేళ్లు లాంటివి) ఉన్న స్త్రీలనూ: అధిక జుట్టు, తక్కువ జుట్టూ ఉన్న స్త్రీలనూ; అనారోగ్యం ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకోరాదు. (మనుస్మృతి 3/8) . తక్కువ కులం స్త్రీలనూ; రాసులు, చెట్లు, నదులు, పర్వతాలు, పక్షులు, పాములు, బానిసల పేర్ల గల స్త్రీలను పెళ్లి చేసుకోరాదు.  (మనుస్మృతి 3/9). అన్నదమ్ములు లేనీ, సామాజికంగా పేరులేని కుటుంబాలలోని ఆడపిల్లలను తెలివైన మగవారు పెళ్లి చేసుకోరాదు. 


 విధవతో సంభోగించటానికి నియమించబడిన వ్యక్తి రాత్రుళ్లు ఆమె వద్దకు వెళ్లి, శుద్ధమైన వెన్నతో మర్ధన చేయించుకొని ఒకే ఒక బిడ్డను ఆమెకు ప్రసాదించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో రెండో బిడ్డ వరకు వెళ్లకూడదు (మనుస్మృతి 9/60). ... అమలులో ఉన్న చట్టం ప్రకారం విధవరాలైన వదిన తెల్లని వస్త్రాలు ధరించినపుడు, శుద్ధమైన మనసుతో ఆమె మరిది ఆమె గర్భవతి అయ్యేంత వరకు ఆమెతో సంభోగించవచ్చు. (మనుస్మృతి 9/77).



మరింత సమాచారం తెలుసుకోండి: