భారతీయ సంప్రదాయాల్లో ఆవుకు చాలా విశిష్టత ఉంది. హిందువులు ఆవును గోమాతగా కొలుస్తారు. అనేక పూజాక్రతువుల్లో గోవు భాగంగా ఉంటుంది. హిందువులు గోవుకు ఇచ్చినంత పవిత్రత, ప్రాధాన్యత ఆధ్యాత్మిక పరంగా వేరే ఏ జంతువుకూ ఇవ్వరంటే అతిశయోక్తి కాదు. గృహ ప్రవేశం వేళ కూడా ముందుగా ఇంట్లో ఆవును తిప్పి.. ఆ తరువాతే ఇంటి యజమాని గృహ ప్రవేశం చేస్తాడు.
ఇక గోవు పాలు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమలం కూడా పవిత్రమైనవిగానే హిందువులు భావిస్తారు. గోమూత్రం ద్వారా కీటకాలు నాశనమవుతాయని అంటారు. అందుకే పవిత్ర కార్యాల్లో గోమూత్రాన్ని ఇంటినిండా చల్లుతారు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఆవు ఖరీదు ఎంత ఉంటుంది..
మహా అయితే 20 వేలు లేదా 30 వేల వరకూ ఉంటుంది. లేదు చాలా ఆరోగ్యంగా బలిష్టంగా ఉన్న ఆవు అయితే .. మహా అయితే ఓ 50 వేల రూపాయల వరకూ ధర పలుకుతుంది. కానీ ఈ ఫోటోలో చూస్తున్న ఆవు మాత్రం మీరు ఊహించలేనంత ఖరీదు ఉంది. అవును మరి ఈ ఆవు ఖరీదు అక్షరాలా 12 కోట్ల రూపాయలు.. అవును మీరు విన్నది నిజమే.
ఆవు ఏంటి.. దాని ధర కోట్ల రూపాయల్లో ఉండటం ఏంటి అనుకుంటున్నారా.. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫోటో ఉన్నది అచ్చమైన పుంగనూరు జాతి ఆవు..ఈ జాతి ఆవులకు ఎన్నో విశిష్ట గుణాలు ఉన్నాయి. సాధారణంగా ఓ ఆవు రోజుకు మహా అయితే...ఓ పది లీటర్లు పాలు ఇస్తే చాలా గొప్ప.. కానీ ఈ పుంగనూరు జాతి ఆవులు మాత్రం ఏకంగా రోజుకు వంద లీటర్ల వరకూ పాలు ఇస్తుందట. అంటే సాధారణ ఆవుకు దాదాపు పది రెట్లు ఎక్కువగా పాలు ఇస్తుందన్నమాట. అంతే కాదు.. ఈ ఆవు పాలనే తిరుమల శ్రీవారి నైవేద్యాల్లో వాడతారట. అందుకనే ఈ ఆవుకు అంత ఖరీదు.