వర్షాలు ఎన్నడూ లేని విధంగా కురుస్తున్నాయి. అతి వృష్టి అనావృష్టి అనేలా వర్షాలు కురుస్తున్నాయి. వస్తే వరదల వస్తుంది లేకపోతే వేడికి పోయేలా చేస్తుంది. వర్షాలు రావాలి మితంగా రావాలి. ఎలా అంటే ఆలా ఎప్పుడంటే అప్పుడు అనవసరంగా వరదను సృష్టించకూడదు. కానీ వాతావరణంలో మార్పులవల్ల వర్షాలు భారీ నుంచి అతిభారీగా పడుతున్నాయి.
ఈ వర్షాల కారణంగా హైదరాబాద్ లో నివసించే ప్రజలు ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియక వణికిపోతున్నారు జనాలు. ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. మొన్నటికి మొన్న కొత్తగా నిర్మాణం అయినా మెట్రో కింద వర్షం వస్తుందని నిలబడితే మెట్రో పెచ్చు పడి ఆ యువతీ అక్కడే మృతి చెందింది. కాగా హైదరాబాద్ లో రోడ్లు ఎంత అందంగా ఉంటాయంటే..
హెల్మెట్ పెట్టుకున్న సరే హైదేరాబద్ రోడ్డుపై ప్రయాణిస్తే ప్రయాణికుడి తల పగలాల్సిందే. రోడ్లపై ఎక్కడ ఏ గుంత ఉంటుందో తెలీదు. వాహనదారులే కాదు పాదచారులు కూడా ఈ వర్షం కారణంగా ఇబ్బంది పడాల్సిందే. మొన్నటికి మొన్న ఓ పాదచారుడు నడుస్తూ డ్రైనేజీ గుంతలో పడిపోయాడు. తర్వాత జిహెచ్ఎంసి వాళ్ళు వచ్చి అతన్ని కాపాడారు. కనీసం ఆ డ్రైనేజీ గుంతలకు ఏం చెయ్యాలో కూడా ఆలోచించారు.
ఇప్పటివరకు మెట్రో నిర్మాణం గురించి, రోడ్ల నిర్మాణం గురించి, డ్రైనేజి గురించి బాధపడ్డాం. కానీ ఇప్పుడు మరో సమస్య.. అదే ఏంటంటే. ఈ వర్షాలకు విద్యుత్ స్థంబాలకు కరెంట్ వచ్చేస్తుంది. ఆలా రావడం వల్ల ఎక్కడ నీరుంటే అక్కడ విద్యుత్ షాక్ సంభవిస్తుంది. దీంతో హైదరాబాద్ లో నివసించే ప్రజలు ప్రాణాన్ని అరా చేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. కొందరు ప్రజలు 'వానొస్తే హైదరాబాద్ సేఫ్ జోనేనా?' అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఇన్ని సమస్యలు ఉన్న హైదరాబాద్ వానొస్తే సేఫ్ జోనా కదా అనేది మిరే చెప్పాలి.