వారిని మీరు చంపుతారా... మేము చంపాలా.?
దేశవ్యాప్తంగా దిశ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో దిశ కేసు నిందితులకు ఉరిశిక్ష పడే వరకు నిరసన ఆపేది లేదని దేశమంతా నినదీస్తోంది. అమాయకురాలైన వైద్యురాలిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను ఉరి తీయకుండా రిమాండ్ విధించి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి తిండి పెట్టడం ఏమిటని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చట్టాలు ఉండటం వల్లే మహిళలపై అత్యాచారాలు చేసేందుకు వెనుకాడటం లేదని నిరసనలు తెలుపుతున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు నిరసనకారులు కంట్రోల్ చేసినప్పటికీ కూడా నిరసనలు ఎక్కడ ఆగడం లేదు.
వి వాంట్ జస్టిస్... జస్టిస్ ఫర్ దిశ అంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నిందితులకు ఉరిశిక్ష పడాలంటు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఘటనపై దేశంలోని రాజకీయ సినీ ప్రముఖులు సైతం స్పందించి ఇలాంటి క్రూర మృగాలను ఉరితీయటమే సరైన శిక్ష అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత దేశ ప్రజానీకానికి చేరిన ఘటన దిశ ఘటన కావడంతో దేశం మొత్తం ఒక్కసారిగా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి . అటు దిశలు తల్లిదండ్రులు కూడా తన కూతురుని తమకు కానరాకుండా చేసిన రాక్షసులని ఉరిశిక్ష విధించాలని... మరోసారి ఆడపిల్ల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఉండేలా శిక్షలు అమలు కావాలంటు డిమాండ్ చేస్తున్నారు.
దేశం మొత్తం దిశా కేసు నిందితులను ఉరిశిక్ష విధించి చంపేయడం అసలైన శిక్షణ అని దేశం మొత్తం నినదీస్తోంది. వారిని మీరు చంపుతారా లేకపోతే బయటికి పంపండి మేము చంపేస్తాము అంటూ నినదిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వారిని వెంటనే ఉరిశిక్ష విధించాలని లేకపోతే మేము చంపేస్తామంటూ ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేసారు. అయితే దిశ రేప్ ఘటన కేసు కోర్టులో విచారణ జరపగా నిందితులకు పది రోజుల రిమాండ్ విధిస్తు కోర్టు తీర్పునిచ్చింది. దీంతో హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది. విశాఖ కేసు నిందితులకు రిమాండ్ విధించడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఆడపిల్లను అతి దారుణంగా రేప్ చేసి హత్య చేసిన నిందితులను వెంటనే కోర్టు ఉరిశిక్ష విధించింది చంపకుండా రిమాండ్కు తరలించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.