చిరంజీవి మళ్ళీ రాజకీయాలపైన మరోసారి కన్నేస్తు న్నారట. సినిమా లలో ఒక వెలుగు వెలిగి మెగాస్టార్ గా ఒక అగ్రనాయకుడిగా ఎదిగిన చిరంజీవి మళ్ళీ పునః ప్రవేశం చేయాలనీ చూస్తున్నట్లు సమాచారం. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు అలాగే ప్రజల ఆలోచనా విధానం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి తరువాత కాంగ్రెస్ లో విలీనము చేసిన తరువాత మళ్ళీ సినిమాల్లో బిజీ అయినా ఎవరికైనా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం బలంగా ఉండాలే గాని ఎప్పటికైనా ఆ ధ్యేయం నెరవేర్చక మానరు.
అలాగే చిరంజీవి కూడా ఒక సూపర్ హిట్ మూవీలోని డైలాగ్ రాననుకున్నారా రాలేననుకున్నారా రావడంలో కాస్త ఆలస్యం అవ్వొచ్చు కాని రావడం మాత్రం పక్కా అనే డైలాగులతో మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజానికాన్ని ఉర్రూతలూగించారు ఏ క్షణాన ఆ డైలాగులు పలికారో గాని చిరంజీవి రాజకీయ భవితకు ఈ డైలాగ్ ప్రస్తత పరిస్థితుల్లో అతికినట్టు సరిపోయాయి. తాన రాజకీయ జీవితానికి స్వల్ప విరామాన్నిచ్చిన మెగాస్టార్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే చిరంజీవి కాంగ్రెస్ లో ఎంపీ గా పనిచేసిన ఈయన మళ్ళీ అదే పార్టీలో కొనసాగుతారా లేదా తమ్ముడు పెట్టిన పార్టీలో కి వెళ్లి తమ్ముడితో కలిసి సేవలను అందిస్తారా మరో పార్టీ పెడతారా అన్నా విషయాలు మాత్రం ఇంకా తెలియలేదు.
చిరంజీవి చేస్తున్న పనులు చూస్తుంటే మాత్రం ఈ డౌట్స్ వస్తున్నాయి. మొన్నటికి మొన్న ఇకపై తాను కేవలం మెగాస్టార్ మాత్రమే అని.. రాజకీయాల్లోకి వెళ్లడం తనకు ఇష్టం లేదని చెప్పేసాడు. అయితే మెగాస్టార్ నిర్ణయం తీసుకున్నా కూడా ఈయన చుట్టూ కొందరు మాత్రం చిరంజీవిని మళ్లీ రాజకీయాల వైపు తీసుకురావాలని చూస్తున్నారు. కాంగ్రెస్ లో ఆయన సభ్యత్వం ఉన్నా కూడా ఇప్పుడు అసలు ఏం పట్టించుకోవడం లేదు.