అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ మీడియా విషయంలో తన వైఖరిని చెప్పకనే చెప్పేశారు. సూటిగానే చెప్పేశారు. జీవో 2430 రద్దు చేయ‌మ‌ని టీడీపీ నాయ‌కులు చేస్తున్న డిమాండ్ పై స్పందించారు. అస‌లు చంద్రబాబు ఈ జీవో చ‌దివి ఉండ‌క‌పోవ‌చ్చు లేదా చ‌దివినా అర్థంక పోయి ఉండొచ్చంటూ వ్యంగ్యాంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి గౌర‌వాన్ని దిగ‌జార్చేలా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అస‌త్య క‌థ‌నాలు రాస్తే చూస్తూ ఊరుకోవాలా.. అంటూ నిలదీశారు.

 

ముఖ్యమంత్రికి ఆ క‌నీస గౌరవం ఉంటుంద‌ని న‌ల‌భై ఏళ్ల అనుభ‌వ‌మున్న చంద్రబాబుకు తెలియ‌క‌పోతే ఎవ‌రూ ఏమీ చేయ‌లేరన్నారు జగన్. ప్రింట్, ఎల‌క్ట్రానిక్, సోషల్ మీడియాలో అస‌త్య ఆరోప‌ణ‌లు ప్రచారం చేయ‌డం కానీ, ప్రింట్ చేయ‌డం కానీ, ప్రసారం చేయ‌డం కానీ చేస్తే చ‌ట్టప‌రంగా చ‌ర్యలు తీసుకుంటామని జీవోలో స్పష్టంగా పేర్కొన‌డం జ‌రిగిందన్నారు.

 

ప్రభుత్వ లేదా ఆయా శాఖ‌ల గౌర‌వాన్ని ప‌డిపోయేలా అస‌త్య ప్రచారం చేస్తే సంబంధిత వ్యక్తలపై చ‌ర్యలు తీసుకుంటామ‌ని జీవో ప్రకటించాని జగన్ చెప్పారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి కూడా టీడీపీ తీరుపై మండిపడ్డారు. సభా సాంప్రదాయాల గురించి ఈ రోజు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి మాట్లాడుతుంటే..మాకు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని పుష్పశ్రీవాణి అన్నారు.

 

పుష్పశ్రీవాణి ఇంకా ఏమన్నారంటే.. “ అచ్చెన్నాయుడు గతంలో ఇదే ప్రాంతంలో కూర్చునేవారు. ఆ రోజు ప్రతి పక్ష నాయకుడిగా ఉన్న వైయస్‌ జగన్‌ను అచ్చెన్నాయుడు అన్న మాటలు చెప్పాలంటే నాకు సంస్కారం గుర్తోస్తోంది. మహిళా ఎమ్మెల్యే అయిన ఆర్కే రోజాను ఆరోజు అన్యాయంగా సస్పెండ్‌ చేశారు. కోర్టు ఆర్డర్‌తో అసెంబ్లీలోకి వస్తుంటే అడ్డుకుని గేటు వద్ద కూర్చోబెట్టారు. మీడియాను రాకుండా నియంత్రించిన పెద్దలు వారు. నిండుసభలో మార్షల్‌ వచ్చి నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఎత్తుకెళ్లారు.ఇంతదారుణంగా ఆ రోజు సభలో ప్రవర్తించిన నేతలు ఇవాళ సభా సంప్రాదాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని గుర్తు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: