డోంట్ వర్రీ... తాగి ఊగండి.. మేము డ్రాప్ చేస్తాం..?
న్యూ ఇయర్ వస్తుందంటే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్రామాల్లో ఎలా ఉన్నప్పటికీ నగరాల్లో మాత్రం సందడి మామూలుగా ఉండదు . పబ్బులు బార్లు అన్ని కళకళలాడుతూ ఉంటాయి. సెలబ్రేషన్స్ చేసేందుకు చాలా పబ్బుల నిర్వాహకులు కూడా ముందు వస్తూ ఉంటారు. వివిధ ఆఫర్లతో ఎంతోమంది జనాలను కూడా ఆకర్షిస్తూ ఉంటారు పబ్బుల నిర్వాహకులు . హైదరాబాద్ నగరంలో అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంగరంగ వైభవంగా కొత్త సంవత్సర సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి హైదరాబాద్ నగరంలో. నగరవాసులు మొత్తం రోడ్ల మీద దర్శనమిస్తూ వుంటారు న్యూ ఇయర్ రోజు. రాత్రి 12 గంటల వరకు వెయిట్ చేసి పటాసులు కాల్చి కేక్ కోసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
న్యూ ఇయర్ అంటేనే ఫుల్లుగా తాగడం ఆ తర్వాత తూగడం... న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే నగరాల్లో ఇది కామన్ . అయితే ఫుల్ గా తాగి వాహనంతో పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాళ్లలో ఫుల్లుగా తాగి రోడ్లమీద కి వచ్చి రచ్చ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. అయితే అటు పబ్ నిర్వాహకులు కూడా సరికొత్త ఆఫర్లతో జనాలను ఆకర్షిస్తున్నారు. ఎలాగో న్యూ ఇయర్ కి అందరూ ఎంజాయ్ మూడ్ లో ఉంటారు ఇంకేముంది ఎంతమందిని ఆకర్షిస్తే అన్ని డబ్బులు దండుకోవడం అని పబ్బుల నిర్వాహకులు మంచి ఆఫర్లను ప్రకటిస్తూ జనాలను ఆకర్షిస్తున్నారు. అయితే అటు పబ్బు నిర్వాహకులకు కూడా పోలీసులు కొన్ని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఎలాంటి అశ్లీలత లేకుండా పబ్బులో నూతన సంవత్సర వేడుకలు జరగాలంటూ పోలీసులు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన ఈవెంట్ నిర్వాహకులు బాధ్యత వహించాలని పోలీసులు హెచ్చరించారు.
ఇకపోతే న్యూ ఇయర్ కి ఫుల్ గా తాగిన తర్వాత ఇంటికి ఎలా వెళ్లాలి రా బాబు అని బాధపడే వారికోసం నిర్వాహకులు ఓ కొత్త ఆఫర్ ని ప్రకటించారు. పబ్ నిర్వాహకులు ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ కు ఎంతో మంది జనాలు ఆకర్షితులవుతున్నారు. ఇంతకీ ఈ ఆఫర్ ఏంటి అంటారా... న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఫుల్లుగా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ ఇబ్బందితో ఇంటికి వెళ్లలేని మందుబాబుల ను.. క్షేమంగా వారి ఇంటి దగ్గర దిగపెడతామని పబ్ నిర్వాహకులు ప్రకటించారు. ఇదేమి ఫ్రీగా కాదండోయ్... దీనికోసం ముందుగానే ఎక్స్ట్రా ఛార్జీలు సైతం వసూలు చేస్తున్నారు పబ్ నిర్వాహకులు. ఇంకేముంది ఈ ఆఫర్ కి జనాలు బాగా ఆకర్షితులవుతున్నారు. ఇకపోతే న్యూ ఇయర్ రోజు ఫుల్లుగా తాగి రోడ్ మీదకు వచ్చి హంగామా చేస్తే మాత్రం పోలీసుల నుండి కఠిన చర్యలు తప్పవంటూ మరోవైపు పోలీసులు హెచ్చరిస్తున్నారు.