విశాఖలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్ అయింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ప్రాంతానికి చెందిన వైసీపీ నేత చిరంజీవిని హత్య చెసేందుకు కుట్ర పన్నిన గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలుమార్లు ఈ గ్యాంగ్ చిరంజీవిని చంపేందుకు రెక్కీ నిర్వహించారని సమాచారం. 10 లక్షల రూపాయలు ఈ గ్యాంగ్ సుపారీ తీసుకుందని సమాచారం. రౌడీషీటర్ కన్నబాబు నాలుగు లక్షల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
 
పోలీసులు గ్యాంగ్ లో ముగ్గురు రౌడీషీటర్లను, మరో 9 మందిని అరెస్ట్ చేసి నిందితుల వద్ద ఉన్న కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ కీలక నేతలలో చిరంజీవి ఒకరు. చిరంజీవికి ప్రత్యర్థులతో కొన్ని వివాదాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు వేరే పార్టీలో ఉన్న చిరంజీవి ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వైసీపీలో చేరారు. వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో చిరంజీవి పెత్తనం బాగా పెరిగిపోయింది. 
 
అతని ప్రత్యర్థి అమ్మి నాయుడు అనే వ్యక్తి హత్యకు ప్లాన్ చేసి సుపారీ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. అమ్మి నాయుడు మరికొందరు నేతలు విశాఖలోని రౌడీషీటర్ కన్నబాబును సంప్రదించి హత్య చేయాలని ప్లాన్ చేశారని సమాచారం. నిందితులు హత్య కోసమే 5 సెల్ ఫోన్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే మూడుసార్లు హత్య చేయటానికి ప్రయత్నించినా సుపారీ గ్యాంగ్ మూడుసార్లు విఫలమైంది. 
 
విశాఖ పోలీసులు ఈ సుపారీ గ్యాంగ్ చిరంజీవిని హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నారని గుర్తించారు. మీడియాకు చెందిన ఒక వ్యక్తి కూడా ఈ గ్యాంగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కుట్రలో ఇంకా ఎవరెవరున్నారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖకు చెందిన ప్రకాష్ అనే వ్యక్తి, రౌడీషీటర్ కన్నబాబు, మరో రౌడీ షీటర్ పరమేష్ ఈ కుట్రలో ప్రధాన నిందితులు అని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: