దేశరాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మేనిఫెస్టోలను విడుదల చేసి ఢిల్లీ ఎన్నికల్లో తమనే విజయం వరించనుందంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. టీవీ9 భారత్ వర్ష్ - సిసిరో ఢిల్లీలో సర్వే చేసి సర్వే ఫలితాలను వెల్లడించింది. ఆప్ పార్టీనే ఢిల్లీలో ఘనవిజయం సాధిస్తుందని ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 
 
టీవీ9 భార‌త్ వ‌ర్ష్ - సిసిరో ఒపీనియ‌న్ స‌ర్వేలో సీఎం కేజ్రీవాల్ పనితీరుపై 60 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ సీఎం అభ్యర్థిగా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఉండగా 18 శాతం ప్రజలు హర్షవర్ధన్ పనీతీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ పనితీరుపై మాత్రం కేవలం 10 శాతం మంది ప్రజలు మాత్రమే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
మెజారిటీ శాతం ప్రజలు ఆప్, బీజేపీ పార్టీలకు అనుకూలంగా ఉండగా కేవలం 2 శాతం మంది అభ్యర్థులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పనితీరు గురించి సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. సర్వేలో 70 అసెంబ్లీ స్థానాలలో ఆప్ పార్టీ 50 - 60 సీట్లలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని, బీజేపీ 10 - 20 సీట్లలో గెలిచే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ 0 - 2 సీట్లలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని తేలింది. 
 
సర్వే ఫలితాలు చూసినా ఢిల్లీలో అంతిమ విజయం మాత్రం అరవింద్ కేజ్రీవాల్ దే అని సర్వేలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. బీజేపీ పార్టీకి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నప్పటికీ ఆప్ పార్టీ మేనిఫెస్టో ముందు బీజేపీ పార్టీ తేలిపోయిందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీలను అమలు చేసే దిశగా బీజేపీ ప్రభుత్వం ఉండటంతో వీటి ప్రభావం కూడా బీజేపీ గెలుపోటములపై పడనుందని తెలుస్తోంది. మరి ఢిల్లీ ఓటర్లు ఏ పార్టీకి ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: