దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 987కు చేరింది. వీరిలో 25 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 86 మంది వైరస్ నుండి కోలుకున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 16 రోజుల పాటు దేశంలో లాక్ డౌన్ కొనసాగనుంది. అనంతరం పరిస్థితులను, కరోనా వ్యాప్తిని పరిశీలించి లాక్ డౌన్ పొడిగించే విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. 
 
తాజాగా కేంద్రం కరోనా వ్యాప్తి చెందకుండా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఢిల్లీలోని 356 మంది ఖైదీలను తీహార్ జైలు నుంచి విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఖైదీలో 63 మందిని కేంద్రం ఎమర్జెన్సీ పెరోల్ కింద విడుదల చేసింది. మిగిలిన వారిని మాత్రం 45 రోజుల మధ్యంతర బెయిల్ పై విడుదల చేసింది. 45 రోజుల అనంతరం పరిస్థితులను బట్టి కేంద్రం బెయిల్ పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. 
 
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కేసుల వల్ల వ్యాధి వ్యాప్తి చెందకుండా కేంద్రం ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఇటలీ, స్పెయిన్, అమెరికా దేశాలలో వేల సంఖ్యలో కరోనా బాధితులు మృతి చెందుతూ ఉండటంతో ప్రభుత్వం అలాంటి పరిస్థితి మన దేశానికి రాకూడదని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
దేశంలో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న తెలంగాణలో 8 పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా బాధితుల సంఖ్య 67కు చేరింది. ఏపీలో ఒకే రోజు 6 పాజిటివ్ కేసుల నమోదు కావడంతో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. లాక్ డౌన్ వల్ల కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: