బుడుగు : పిల్లల విషయంలో ప్రతి తల్లితండ్రులు ఈ సూచనలు పాటించండి.. !లేదంటే వాళ్ళ భవిష్యత్తు అంతే... !!

Suma Kallamadi

పిల్లల పెంపకం అనేది చాలా కష్టం అనే భావనలో ఉంటారు ప్రతి తల్లిదండ్రులు.  పిల్లలు అన్నిపనుల్లో సక్రమంగా ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు.కాని పిల్లలు మాత్రం పెద్దల మాట వినరు.  పిల్లలు తప్పుచేస్తే మొదట తప్పుపట్టేది తల్లినే. క్రమశిక్షణతో పిల్లల్ని పెంచడం మంచిదే కాని క్రమశిక్షణ మితిమీరితే చాలా ప్రమాదకరం.

 

 

పిల్లలకి  వాళ్ళ  బాల్యాన్ని తిరిగి చూసుకుంటే పసితనపు గుర్తులేవీ ఉండవు. అందుకే ఏప్పుడూ కాకపోయిన ఎప్పుడో ఒకసారి వారిని రొటీన్ లైఫ్ నుంచి బయటపడనివ్వండి. మెల్లగా లేవనివ్వండి, హాయిగా ఆడుకొనివ్వండి, ఒక విషయం వద్దు అనే ముందు ఎందుకు వద్దో వివరించండి.

 

 

ఒకవేళ వారు మీ వాదన కాదని వారి ఎదో ఏదన్నా  మాట చెప్తే, అందులో నిజం ఉంటే, వారి ఆలోచనకి విలువ ఇవ్వండి. అంతేకాని మేము పెద్దవాళ్ళము మా మాటే వినాలి అనే ధోరణి మానేయండి. ఒకవేళ చిన్నారి చెప్పిన ఆలోచన మీకు మంచిది కాదు అని అనుకుంటే దురుసు స్వభావంతో వాళ్ళని వద్దు అని బాధ పెట్టకుండా వాళ్ళకి అర్ధమయ్యే విధంగా చెప్పి చుడండి. పిల్లలు తీసుకునే తప్పు నిర్ణయం వల్ల వాళ్ళకి ఎటువంటి హాని అనేది జరిగిద్దో అనేది వాళ్ళకి వివరంగా చెప్పండి. అప్పుడు మీ మాట తప్పకుండా వింటాడు. ఇంట్లో జరిగే ఏ విషయం అయిన పిల్లలతో డిస్కస్ చేయండి. 

 

 

 

 అప్పుడు  వాళ్ళు పెద్దయ్యాక కూడా ఈ సంభాషించుకునే ప్రక్రియ కొనసాగుతుంది. లేకపోతే చిన్నప్పుడు మీరు చెప్పింది వింటారు పెద్దయ్యాక వాళ్లమాటే నెగ్గేలా చూసుకుంటారు. పసితనం మహా అయితే ఒక నాలుగైదేళ్లు ఉంటుంది, వారి జీవితంలోని ఆ కాస్త సమయం వారికిచ్చేయ్యండి మంచి చెడు చెప్పండి, మంచెదో చెడేదో మీరే డిసైడ్ చేయకండి. కాబట్టి పిల్లలతో తల్లిదండ్రులులా కాకుండా స్నేహితులుగా మెలగండి..స్కూల్ నుంచి రాగానే పిల్లల దగ్గర కుర్చీని కాసేపు మాట్లాడండి వాళ్ళ స్కూల్ లో జరిగిన విషయాలు గూర్చి అడగండి. వాడు చెప్పేది వినండి. తర్వాత చదవమని చెప్పండి  అంతేగాని పదే పదే చదువు అని అనకండి.. "ప్రాణం లేని ఫోన్ తో గంటలు గంటలు గడుపుతామో అదే ప్రాణం ఉన్న కన్నా బిడ్డలతో గడపలేని జీవితం ఒక జీవితమేనా"... !!ఒక్కసారి ఆలోచించండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: