అప్పుడు నేను మహాటీవిలో పని చేస్తున్న రోజులు... ఒక ఆదివారం రోజు డ్యూటీలో భాగంగా సికింద్రాబాద్ లోని ప్యాట్ని మీదుగా వెళ్తున్నా.. అక్కడ ఉన్న ఫుట్ పాత్ మీద ఒక రకమైన సందడి వాతవారణం కనిపించి అక్కడికి వెళ్ళాను.అక్కడ ఒకాయన కొన్ని ఆహారం (బిర్యానీ కూడా) పాకెట్లు, కంబళ్ళను పంపిణి చేస్తున్నాడు.
ఈ కాలంలో ఏవరబ్బా ఈ దానకర్ణుడని, కొంచెం ఆసక్తితో ఆయనను పరిచయం చేసుకున్నాను. ఆయన తన పేరు చెప్పలేదు. కాని, "ఈ దానాలు నేను చేసేవి కాదండి. ఈ అన్నం పొట్లాలు, కంబళ్ళు ముఖ్యమంత్రి (వై ఎస్ రాజశేఖరరెడ్డి) గారి భార్య పంపించారని" అసలు విషయం చెప్పాడు.
ఇంకొంచెం క్యూరియాసిటితో మరికొన్ని విషయాలు అడిగాను. "ఆమే ప్రతి ఆదివారం ఇలా దాదాపు వంద అన్నం పాకెట్లు, కంబళ్ళను పేదలకు దానం చేస్తారని, ప్రతీ వారం నగరంలోని ఒక్కో ప్రాంతానికి వెళ్ళి ఇలా ఇచ్చి వస్తుంటానని" ఆయన అన్నారు.
ఈ విషయం మీద ఒక స్పెషల్ స్టోరీ చేయాలని అనిపించింది, కాని అప్పట్లో ఉన్న కొన్ని పరిస్థితుల దృష్ట్యా సాధ్యపడలేదు.
ఇలా ప్రతి ఆదివారం ఆ దానాలు చేసే పుణ్యమూర్తి శ్రీమతి వై ఎస్ విజయమ్మ గారు...ఈ విషయం ఎప్పటి నుంచో చెప్పాలని అనిపించేది.ఈ రోజు ( ఏప్రిల్ 19 ) ఆ "అమ్మ" పుట్టినరోజు..ఆమే ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, మరెందరో పేదలను ఆదుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా....
( ఈ పోస్ట్ లో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదు. ఎవరి ప్రాపకం కోసమో రాసింది అంతకన్నా కాదు)
#జయప్రకాశ్_అంకం.....
( ఫేస్‌బుక్ వాల్ నుంచి )