వైద్యులు కరోనా సోకిన వ్యక్తులు ఒక క్రమ పద్ధతిలో రోజూ మూడుసార్లు ఆవిరి పట్టుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఈ విధంగా చేస్తూ వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్న వాళ్లు త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ లో 20,000 మంది కరోనా బాధితులు ఉండగా వాళ్లలో 15,000 మంది హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స చేయించుకుంటున్నారు. అయితే కొందరు కరోనా నుంచి కోలుకోవడం కోసం సోషల్ మీడియా పోస్టులను ఫాలో అవుతున్నారు.
కొందరు రోగ నిరోధక శక్తి పెరగడం కోసం అతిగా కషాయం తాగుతుండగా మరికొందరు ఇష్టానుసారం మందులు వాడుతున్నారు. ఈ విధంగా చేస్తే మరింత ప్రమాదం అని కరోనా నుంచి కోలుకోవడానికి ఆవిరి మాత్రమే మార్గమని వైద్యులు చెబుతున్నారు. రోజుకు మూడు పూటలా 15 నిమిషాల పాటు ఆవిరి పట్టాలని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఆక్సిజన్ శాతం మెరుగుపడుతుందని తెలుపుతున్నారు.
పాత్రలో మరిగించిన నీటిలో పసుపు వేసి ఆవిరి పడితే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ఈ విధానం వల్ల శ్వాస ప్రక్రియకు అడ్డుపడుతున్న సెకండరీ ఇన్ ఫెక్షన్ తొలగిపోతుందని... ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. ఆవిరి పట్టడం వల్ల ఊపిరితిత్తుల పై భాగంలో చేరిన మ్యూకస్ తొలగిపోతుందని... ఇలా చాలామందికి చికిత్స అందించామని చెబుతున్నారు. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వైరస్ వ్యాప్తిని నియంత్రించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.