ఆంధ్రప్రదేశ్ లో న్యాయవ్యవస్థ నుండి ప్రభుత్వానికి గత కొంతకాలంగా అనేక విషయాలలో చుక్కెదురవుతోంది. కారణాలు ఏమైనప్పటికీ చరిత్రలో ఎప్పుడూ జరగనివిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్ట్ వారు తీర్పులివ్వడం దేశంలో సంచలనమయ్యింది. దీనికి లీడర్ అఫ్ ది ఏపీ అయిన జగన్ మోహన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించక తప్పదు. అయితే ప్రత్యక్షంగా ఈయన పాత్ర లేనప్పటికీ ఇటువంటి విషయాలలో సలహాలిస్తూ పక్కనే ఉన్న రాజ్యసభ ఎంపీ వైఎస్ విజయ సాయి రెడ్డి పైన ఇతర రాజకీయ పార్టీలు మరియు సొంత గూటికి చెందిన ఒకరిద్దరు నాయకులు విమర్శిస్తూ వస్తున్నారు. దీనికి విజయసాయిరెడ్డి కూడా మీడియా ముఖంగా జవాబులిస్తూ వస్తున్నారు.


ఈనెల 14 నుండి ప్రారంభమయిన పార్లమెంట్ సమావేశాలలో నిన్న రాజ్యసభలో విజయసాయిరెడ్డి దీని గురించి మాట్లాడుతూ న్యాయవ్యవస్ధ నుంచి ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ వ్యాఖ్యలు చేసారు.  ఈ రీతిలో నేరుగా కోర్టులను టార్గెట్‌ చేసేలా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వీటిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న పార్లమెంటులో పార్టీలకతీతంగా ఎంపీలు దీనిపై చర్చించుకోవడం కనిపించింది.  వైసీపీ వాళ్ళు ఎప్పడు దొరుకుతారా అని ఎదురుచూసే టీడీపీ పార్టీ ఎంపీ మధ్యలో కలగచేసుకుని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కు ఫిర్యాదు చేయడంతో, వెంటనే స్పందించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.


అయితే ఇంతవరకు ఏపీలో పాలన బాగా జరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి న్యాయవ్యవస్థకు మధ్యన ఏ స్థాయిలో వివాదాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసింది.  మరి ఇప్పుడు న్యాయవ్యవస్థకు విరుద్ధముగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వనికి ఎటువంటి కష్టాలు తెస్తాయోనని సొంతపార్టీ నాయకులు లోలోపల మధన పడుతున్నారు. ఏపీలో కూడా ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, సిపిఐ, బీజేపీ మరియు టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మరికొందరు ఎంతటివారైనా న్యాయవ్యవస్థ ముందు సమానమని ఏపీ ప్రభుత్వం గుర్తించాలి అని చురకలు వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: