ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటే అనుకుంటుంది. స్వతహాగా ఏ పార్టీ అండదండలు సహాయ సహకారాలు లేకుండా అభివృద్ధి చెందాలని అనుకుంటూ ఉంటుంది. మరియు మిగతా పార్టీలు అంతా కూడా తన వెనకాల పడాలి అనుకుంటుంది. అంటే మొత్తానికి శాసించే స్థాయిలో ఉండాలని కోరుకుంటుంది. ఇది కనీస రాజకీయ ధర్మంగా చెప్పుకోవచ్చు. అలా కాకుండా కొన్ని పార్టీలతో కలిస్తేనే మా పార్టీ మనుగడ ఉంటుంది అని భావిస్తే కనుక సదరు పార్టీ రాజకీయ ప్రమాదంలో ఉన్నట్లే అవుతుంది. ఎందుకు అంటే ఆ విధంగా చేయకపోతే ఆ సందర్భంలో సమస్యకు దారి తీస్తుంది.  సందర్భానుసారం కలయిక అంటే ఓకే కానీ, పూర్తి స్థాయిలో ఇతర పార్టీలతో రాజకీయ పొత్తు అంటే అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉంటుంది.

ఇది కొనసాగితే పార్టీలోఉన్న కార్యకర్తలు కూడా అసంతృప్తికి లోనయ్యే  అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకే పార్టీ అనుకోండి రేపు ఏదైనా ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు వస్తుందిలే అనుకుని కష్టపడతారు..అలా కాకుండా రెండు మూడు పార్టీలు కలిస్తే వీరికే సీటు వస్తుందని నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి. ప్రస్తుతం ఏపీలో ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నది తెలుగుదేశం పార్టీ.  జనసేన పార్టీ కోసం ఇప్పుడు టీడీపీ త్యాగం చేస్తోంది అని విమర్శలు ఎక్కువయ్యాయి. ఎలాగైనా జనసేనతో కలవడానికి తీవ్ర కసరత్తులు చేస్తోంది టీడీపీ. ప్రస్తుతం టీడీపీ లో ఎవరైతే చంద్రబాబు నాయుడిని ప్రభావితం చేయగలరో ఆ బృందం ఇప్పుడు పైకి తెస్తున్న ప్రధాన అంశం ఏమిటంటే, రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఏమి జరిగినా కానీ, టీడీపీ మరియు జనసేన ఒకటిగా పోటీకి చేస్తుంది అని ఖరాకండీగా చెబుతున్నారు. పోటీ కూడా చాలా రసావత్రంగా యూటీనుందని అంచనా వేస్తున్నారు.

జనసేన ముఖ్యంగా గోదావరి జిల్లాలను వదిలేసి కృష్ణా జిల్లాలో  అవనిగడ్డ కానీ లేదా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కానీ పోటీ చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఈ బృందం అభిప్రాయపడుతోంది. పార్లమెంట్ కి ఒక్క సీటు చొప్పున 25 చోట్ల జనసేనకు అవకాశం ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గెలుపు పూర్తిగా టీడీపీ తీసుకోవాలి. అంతే కాకుండా అధికారంలోకి వచ్చిన తరువాత ఉప ముఖ్యమంత్రి మరియు హోమ్ శాఖ పవన్ కళ్యాణ్ కే అప్పచెప్పాలి.  ఇన్ని ప్రణాళికలు టీడీపీ వేసుకుంటోంది. మరి దీనిపై జనసేన ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: