తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు అనే ప్రచారం రాజకీయ వర్గాలు ఎక్కువగా జరుగుతుంది. కొంతమంది నేతల విషయంలో చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరి ఇబ్బందికరంగా మారడంతో కొంతమంది పార్టీకి గుడ్బై చెప్పే ఆలోచనలో ఉన్నారని ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగింది. ఇది ఎంతవరకు నిజం ఏంటనేది తెలియకపోయినా కొంతమంది విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇబ్బందికరంగానే వ్యవహరించారు. ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు వద్దకు రావాలి అని భావించిన సరే అది సాధ్యం కాలేదు అని కొంతమంది వ్యాఖ్యానించారు.

అలాగే ఎమ్మెల్సీలు కూడా కొంతమంది ఇప్పుడు పార్టీ అధిష్టానం దెబ్బకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అనే భావన కూడా ఉంది. రాయలసీమ జిల్లాలకు చెందిన కొంత మంది ఎమ్మెల్సీలు పార్టీలో ఉండడానికి కష్టపడుతున్నారు. తమతమ నియోజకవర్గాల్లో తమ తమ జిల్లాలో ఉన్న పరిస్థితులను పార్టీ అధిష్టానంకు వివరించే ప్రయత్నం చేస్తున్నా సరే తమను పక్కన పెడుతున్నారని... కొంతమందికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఉంటే పార్టీ అనవసరంగా ఇబ్బంది పడుతుందనే భావన కొంతమందిలో ఉంది.

ఇక చంద్రబాబు నాయుడు కొన్ని అంశాలను పట్టించుకోవాల్సిన తరుణంలో కూడా పట్టించుకోకుండా పార్టీని సమస్యలకు గురి చేస్తున్నారు అంటూ కొంతమంది నేరుగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది పార్టీ నుంచి బయటకు రావడానికి కూడా సిద్ధమవుతున్నట్లుగా రాజకీయవర్గాలు అంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు బయటకు వచ్చినా సరే పార్టీ సంస్థాగతంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు కొంత మందిని కలవాలి అని సూచిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు పార్టీ మారినా చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష నేత హోదా కూడా పోయే అవకాశాలు ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: