ఢిల్లీ హై కోర్ట్: పాజిటివ్ రాకున్నా లక్షణాలుంటే హాస్పిటల్ కే ...?

VAMSI
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తన పంజా విసురుతోంది ప్రళయాన్ని సృష్టిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి వేగం, ప్రభావం ఏ రేంజ్ లో ఉందంటే వీధి వీధికి కరోనా పేషెంట్లు ఉంటున్నారు. ముంబై , ఢిల్లీ, వంటి ప్రాంతాలలో వైరస్ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. చాలా ప్రదేశాల్లో కరోనా టెస్ట్ లు తగిన స్థాయిలో జరగకపోవడంతో... కరోనానో కాదో అని తెలియకుండానే కొందరు ప్రజలు లక్షణాలతో బాధపడుతున్నారు. అయితే తాజాగా కరోనా వైరస్ కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. కరోనా నిర్ధారణ పరీక్ష... పాజిటివ్ రిపోర్టు రానప్పటికీ.. కరోనా లక్షణాలు కనుక ఉంటే అటువంటి వారిని హాస్పిటల్స్ లో చేర్చేలా ఆదేశాలు జారీ చేయాలని సూచించింది ఢిల్లీ న్యాయస్థానం.
ఈ కరోనా కష్ట సమయంలో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ డీఎన్‌ పాటిల్‌ , మరియు ప్రముఖ న్యాయవాదులు జస్టిస్‌ జస్మీత్‌ సింగ్. ఈ విషయంపై విచారించి అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలంటూ  హాస్పిటల్స్ కు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఆసుపత్రి తప్పకుండా పాటించాలని, నిబంధనలను అతిక్రమించరాదని సోమవారం నాడు సూచించింది. అంతేకాక ఈ విచారణకు కేంద్రం వైపు నుండి హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌శర్మ  కరోనా పరీక్షలు పెద్దగా జరగడం లేదని ధర్మాసనంకి వివరించారు. కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఈ తరుణంలో భారీ సంఖ్యలో కరోనా టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. కానీ అందుకు తగ్గట్టుగా పరీక్షలు జరపడం లేదని ఆయన తెలిపారు.
దీంతో కరోనా పరీక్ష కేంద్రాలను పెంచి పెద్ద ఎత్తున టెస్ట్ లు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వానికి తెలిపింది న్యాయస్థానం.
కరోనా పరీక్షలు భారీగా చేయడం వలన వైరస్ సోకిన వ్యక్తులను త్వరగా గుర్తించవచ్చు. తద్వారా అలంటి వారికి చికిత్స ఇచ్చి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. అంతే కాకుండా ఇతరులకు సోకకుండా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు. కాబట్టి హై కోర్ట్ ఢిల్లీ ప్రభుత్వానికి కరోనా పాజిటివ్ లేకున్నా, చిన్న పాటి లక్షణాలు ఉన్నా అలాంటి వారిని హాస్పిటల్ కి తరలించేలా కఠినతరమైన ఆదేశాలు జరీ చేయమని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: