అయితే ఇప్పటి వరకు ఏ దేశంలోనూ పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ప్రయోగ దశలో ఉన్నాయే తప్ప వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు కాలేదు. అయితే కరోనా మూడవ దశ ముంచుకొస్తున్న వేళ అప్రమత్తమైన ఆరోగ్య నిపుణులు పిల్లల కోసం వ్యాక్సిన్ ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలను వేగవంతం చేశారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లతో పిల్లలపై ప్రయోగాలు మొదలు పెట్టేశారు. పలు దేశాల్లో వివిధ వయసుల పిల్లలకు వ్యాక్సిన్లను ఇస్తున్నారు. మన భారతదేశంలో భారత్ బయోటిక్ సంస్థ రెండేళ్ల నుండి 18 ఏళ్ళ లోపల పిల్లల కోసం తయారు చేసిన వ్యాక్సిన్ ను మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ కోసం తాజాగా అనుమతులు పొందింది. దాంతో ఢిల్లీ ఎయిమ్స్ పాట్నా ఎయిమ్స్ నాగపూర్ మెదిత్రినా ఇన్స్టిట్యూట్లో త్వరలో ప్రయోగాలు మొదలు కాబోతున్నాయి.
ఇప్పటికే 12 నుంచి 17 ఏళ్ల వయసు పిల్లలకు ప్రయోగాలు నిర్వహించగా వాటి ఫలితాల వివరాలు త్వరలో తెలియనున్నాయి. అదే విధంగా 6 నుండి 11 ఏళ్ళ వయసు ఉన్న చిన్నారుల కోసం ఓ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తోంది ఈ సంస్థ. మరోవైపు ఆస్ట్రా జెనికా సంస్థ ఆరు నెలలు పైబడిన చిన్నారులకు టీకాలు అందించే విధంగా ప్రయోగాలను ముమ్మరం చేసింది. మరోవైపు ఫైజర్ బయోటెక్ సంస్థ చిన్నారుల కోసం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కు అమెరికా కెనడాల్లో అనుమతులు అందడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న వేళ ఇలా పలు దేశాలలో పిల్లల కోసం వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను వేగవంతం చేశాయి. మరి అతి త్వరలో వీరికి వ్యాక్సిన్ వచ్చి కనీసం పిల్లలయినా ఆరోగ్యంగా ఉండేలా జరగాలని ఆశిద్దాం.