అమ‌రావ‌తి : క‌రోన వైర‌స్ బారిన‌ప‌డి కోలుకున్న వారికి ఇప్పుడు బ్లాక్ ఫంగ‌స్ ముప్పుగా మారుతుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ్లాక్ ఫంగ‌స్‌తో ముగ్గురు మృతి చెందారు.గుంటూరుకు చెందిన 30 ఏళ్ల యువకుడు, కర్నూలుకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు కర్నూలు ప్ర‌భుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్స తీసుకొని కోలుకున్నారు. ఆ తర్వాత బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలతో మళ్లీ ఆసుపత్రిలో చేరడంతో వైద్యులు చికిత్స చేశారు.ఈ క్రమంలో యువకుడు శుక్రవారం, వృద్ధుడు శనివారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కర్నూలు నగరానికి చెందిన మరో యువకుడికీ బ్లాక్‌ ఫంగస్‌ రావడంతో మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు సమాచారం. రెండురోజుల కిందటే యువకుడి తండ్రి కూడా కొవిడ్‌తో చనిపోయాడు.

గుంటూరు జిల్లాలో కూడా బ్లాక్ ఫంగ‌స్ కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. గ్రామాల్లో ఇప్పుడిప్పుడే ఈ కేసులు వ‌స్తుండ‌టంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లో ఉన్నారు.ఈ బ్లాక్ ఫంగ‌స్ ముదిరి కంటికి సోక‌డంతో క‌నుగుడ్లు కూడా తీసివేయాల్సి ప‌రిస్థితి వ‌స్తుంద‌ని నిపుణులు అంటున్నారు.ప్ర‌ధానంగా ఈ బ్లాక్ ఫంగ‌స్ కేసులు క‌ర్నూల్ జిల్లాలో ఎక్కువ‌గా న‌మోదుకాగా ఇప్పుడు అన్ని జిల్లాల్లో కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

తాజ‌గా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జిల్లాలోని నిడ‌ద‌వోలులో మ‌రో బ్లాక్ ఫంగ‌స్ కేసు బ‌య‌ట‌ప‌డింది.బ్లాక్ ఫంగ‌స్ బారిన‌ప‌డిన వ్య‌క్తి ఇంటికి ఆర్డీవో, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, నోడ‌ల్ ఆఫీస‌ర్ వెళ్లి బాధితుడితో మాట్లాడి ల్యాబ్ రిపోర్టుల‌ను ప‌రిశీలించారు. ఫంగ‌స్ ల‌క్ష‌ణాల‌పై ఉన్న‌తాధికారుల‌కు రిపోర్ట్ చేస్తామ‌ని ఆర్డీవో తెలిపారు. త‌క్ష‌ణమే మెరుగైన వైద్యం అందించేందుక ఏర్పాటు చేస్తామ‌ని అధికారులు బాధితుడికి హామీ ఇచ్చారు.

Powered by Froala Editor

Find out more: