గత కొంతకాలముగా ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన అధ్యక్షుడు మరియు ఇతర నాయకులంతా రాష్ట్రంలో జరుగుతున్న టీడీపీ నేతల అరెస్టులపై, వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఈ అరెస్టులను చేస్తోందని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దీనిపై వైసీపీ నాయకులు కూడా వారికి తగిన సమాధానాలను ఇస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే నిన్న జరిగిన అరెస్ట్ సంచలనంగా మారింది. వివరాల్లోకి  వెళితే నిన్న రాత్రి బనగానిపల్లె మాజీ టీడీపీ బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై ఎప్పటిలాగే చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. అయితే ఇంతకు ముందు జరిగిన అరెస్టులన్నీ కూడా పాత అవినీతి కథలో  లేదా మరొక కారణమో ఉండేది.

కానీ ఇప్పుడు జరిగిన అరెస్ట్ ను చూస్తే నిన్న సాయంత్రం దాడికి పాల్పడిన కారణంగా ఈ అరెస్ట్ జరిగిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నటు తెలుస్తోంది. ఇప్పటి వరకు కక్ష గట్టి అరెస్టు చేస్తున్నారు అనే ఆరోపణలమీద టీడీపీ ఏమి చెబుతుందో తెలియాల్సి ఉంది.  వైసీపీ కార్యకర్త కోనేటి దుర్గాప్రసాద్, ఈయన కాటసాని అనుచరుడు. ఈయనపై తీవ్రస్థాయిలో దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. రోడ్డుమీద పడేసి కొట్టడం జరిగిందని తెలుస్తోంది. దీని కారణంగానే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అది పనిగా ప్లాన్ చేసి మరీ రాడ్ లతో దాడి చేశారనే విషయం క్లియర్ గా తెలుస్తూ ఉంది.

సదరు వ్యక్తి వారి నుండి తప్పించుకుని వెళుతున్నా కూడా వదలకుండా వెంటపడి కొట్టడం జరిగింది.  ఇప్పటికే ఈ వీడియో టీడీపీ నాయకుల వరకు చేరి ఉంటుంది. ఇంత దారుణంగా కొట్టిన తరువాత కూడా దాడికి కారణమయిన వారిని అరెస్ట్ చేయక ? నిలబెట్టి పాలాభిషేకం చేయాలా ? అంటూ నెటిజన్లు మరియు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: