ఆడైనా.. మగైనా.. సింహం.. సింహమే! మారేడుపల్లి అడవికి రాజైన సింహం ఒకరోజు హఠాత్తుగా అనారోగ్యంతో మరణించింది. దీంతో అడవిలోని జంతువులన్నీ బాధతో తల్లడిల్లిపోయాయి. కొన్నిరోజుల తరువాత బాగా ఆలోచించి జంతువులన్నీ ఓ చోట సమావేశమయ్యాయి. ఈ అడవిని పాలించడానికి రాణి సివంగినే సమర్థురాలు అని నిర్ణయించుకున్నాయి. ఆ విషయాన్ని సివంగితో చెప్పాయి. వాటిలో పులి, నక్క తోడేలుకు అది ఏమాత్రం నచ్చలేదు. వాటి నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడాయి. నక్క, తోడేలు ముందుకు వచ్చి.. ‘ఏమిటీ విడ్డూరం.. ఇంత వరకు ఇలాంటిది ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా? ఒక ఆడసింహం అడవిని పాలించ మారేడుపల్లి అడవికి రాజైన సింహం ఒకరోజు హఠాత్తుగా అనారోగ్యంతో మరణించింది. దీంతో అడవిలోని జంతువులన్నీ బాధతో తల్లడిల్లిపోయాయి. కొన్నిరోజుల తరువాత బాగా ఆలోచించి జంతువులన్నీ ఓ చోట సమావేశమయ్యాయి. ఈ అడవిని పాలించడానికి రాణి సివంగినే సమర్థురాలు అని నిర్ణయించుకున్నాయి. ఆ విషయాన్ని సివంగితో చెప్పాయి. వాటిలో పులి, నక్క తోడేలుకు అది ఏమాత్రం నచ్చలేదు. వాటి నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడాయి. నక్క, తోడేలు ముందుకు వచ్చి.. ‘ఏమిటీ విడ్డూరం.. ఇంత వరకు ఇలాంటిది ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా? ఒక ఆడసింహం అడవిని పాలించడమా? మేం దీనికి ఒప్పుకోం. మా స్నేహితుడైన పులినే రాజుగా ఎన్నుకోండి’ అన్నాయి. దానికి జంతువులన్నీ కోపంగా.. ‘లేదు.. లేదు.. ఎవరికీ సాయం చేయకుండా చెడు చేసే ఆ దుష్ట పులిని మహారాజుగా ఎన్నుకోవాలా? దానికి మేం అస్సలు ఒప్పుకోం’ అన్నాయి. అంతలో ఓ ఏనుగు ముందుకు వచ్చి.. ‘ఏమిటి.. మీరు మాట్లాడుతోంది. రాణి సివంగి అడవిని పాలించడంలో మీకు అభ్యంతరం ఏంటి? ఎంతో తెలివైన మనుషుల్లో కూడా ఆడ, మగ అనే తేడా లేకుండా.. ఇప్పుడు మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు కూడా అన్ని రంగాల్లో ముందుంటున్నారు. కష్ట సమయాల్లో తమ రాజ్యాలను రాణి రుద్రమదేవి, రాణి ఝాన్సీలక్ష్మీబాయి వంటి వారు ఎందరో ఎంతో గొప్పగా పరిపాలించారు. అటువంటిది మన అడవిలో అందరికీ మేలు చేసే రాణి సివంగిని పాలకురాలిగా ఎన్నుకోవడంలో తప్పు ఏముంది?’ అంది. అయినప్పటికీ నక్క, తోడేలు ఇంకా మూర్ఖంగా వాదిస్తూ.. ‘అదంతా మాకు తెలియదు. సివంగి మమ్మల్ని పాలించడానికి మేము ఎంత మాత్రమూ ఒప్పుకోం. మా స్నేహితుడు పులి ఈ అడవిలో అన్ని జంతువుల కంటే బలవంతుడు. ఆ సివంగి ఈ పులితో పోరాడి గెలిస్తే మీరు అన్నదానికి మేము ఒప్పుకుంటాం. ఒక వేళ మా స్నేహితుడు గెలిస్తే, మా మాటలను మీరు ఒప్పుకోవాలి’ అన్నాయి. జంతువులన్నీ మౌనంగా ఉన్నాయి. అంతలో రాణి సివంగి ముందుకు వచ్చి నా మీద నమ్మకం పెట్టుకున్న నా జంతువుల మీద అభిమానంతో నేను ఆ పులితో పోరాటం చేస్తాను అని ధైర్యంగా చెప్పింది. దానికి జంతువులన్నీ రాణి సివంగిని ఎంతో అభినందించి ప్రోత్సహించాయి. పులి, నక్క, తోడేలు తమదే గెలుపు అని గట్టి నమ్మకంతో ఉన్నాయి. కాసేపటికి పులి, రాణి సివంగి మధ్య పోరాటం మొదలైంది. రెండూ భీకరంగా కొట్టుకుంటున్నాయి. కొద్దిసేపటికి సివంగిలో కాస్త శక్తి సన్నగిల్లింది. జంతువులన్నీ ఎంతో బాధ పడ్డాయి. ఎలాగైనా సివంగిని చంపేయాలని పులి ముందే నిశ్చయించుకుంది.<br> రాణి సివంగి ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా లేచి శక్తిని కూడగట్టుకుంది. తాను కొత్తగా ఏనుగు దగ్గర ఆత్మ రక్షణ కోసం రహస్యంగా నేర్చుకున్న ఒక యుద్ధ విద్యను ఆ పులిపై ఆఖరి అస్త్రంగా ప్రయోగించింది. దెబ్బకు పులి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడున్న జంతువులన్నీ ఆశ్చర్యానికి గురై, రాణి సివంగికి జేజేలు పలికాయి. తీవ్రగాయాలపాలై పులి, అవమాన భారంతో నక్క, తోడేలు అక్కడి నుంచి వేరే అడవిలోకి పారిపోయాయి. అది చూసి మిగతా జంతువులు సంబరాలు చేసుకున్నాయి.

 అతివ పవన్ లోకేష్

మోహన్

మహేశ్

 రవితేజ

Find out more: