ఒక్క ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చో తెలుసా?
అంతే కాదు బ్యాంకు ఖాతా తీసుకోవాలన్న.. ఐటిఆర్ దాఖలు చేయాలి అన్న కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే ఇప్పుడు సిమ్ కార్డు తీసుకోవడానికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరి గా మారిపోయింది ఒకప్పుడు ఓటర్ ఐడి, రేషన్ కార్డు లాంటి డాక్యుమెంట్స్ తీసుకొని సిమ్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు సిమ్ తీసుకోవడానికి ఆధార్ కార్డు అవసరం తప్పనిసరి గా మారిపోయింది. సాధారణంగా నేటి రోజుల్లో చాలామంది ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులు వాడుతూ ఉంటారు. మరి కొంతమంది 1, 2 కాదు అంతకు మించి అనే రేంజ్ లో ఏకంగా సిమ్ కార్డులు వాడుతూ ఉంటారు.
అయితే ఒక వ్యక్తి ఆధార్ కార్డు పై ఎన్ని సిమ్ కార్డు తీసుకోవచ్చు అన్న విషయం మాత్రం చాలామందికి తెలియదు. అయితే గతంలో ఒక వ్యక్తి పేరు పై కేవలం 9 కార్డులు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం ఈ రూల్ సడలించింది. ఇక ఒక వ్యక్తి పేరు పై 18 సిమ్ కార్డుల వరకూ తీసుకునే వెసులు బాటు కల్పించింది. టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తన ఆధార్ కార్డు పై 18 సిమ్ కార్డుల వరకు తీసుకోవచ్చు. కానీ ఇక 18 సిమ్ కార్డులు విషయంలో కొన్ని నిబంధనలు ఉంటాయి అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్ కోసం 9 కాదు తీసుకుంటే మిగిలిన తొమ్మిది సిమ్ కార్డులు ఎం2ఎం కమ్యూనికేషన్ కోసం తీసుకునే అవకాశం ఉంటుంది.