కర్ణాటకలో బీజేపీ నాయకత్వం కేంద్రం సహాయంతో అనుకున్న విధముగా రాష్ట్రాన్ని రాజకీయం చేస్తూ వెళుతోంది. కొద్ది రోజుల క్రితమే వివిధ వివాదాలు మరియు ఆరోపణల కారణంగా సీఎంగా ఉన్న యడ్డ్యూరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సీఎం పోస్ట్ పై చాలా మందే ఆశ పడ్డారు. కానీ అనూహ్యంగా మాజీ సీఎం కుమారుడు బసవరాజు బొమ్మై అధిష్టానం సహాయంతో సీఎం కుర్చీ ఎక్కాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఆ తర్వాత యధావిధిగా కేబినెట్ ను ఏర్పాటు చేశాడు. ఇక్కడ స్టార్ట్ అయింది అసలు యుద్ధం. సీఎం తమకంటే తమకే వస్తుందని ఆశపడిన వారంతా బసవరాజు బొమ్మై గుర్రుగా ఉన్నారు. కానీ యడ్డీ మద్దతు ఉండడంతో అప్పుడు కిక్కురుమనకుండా ఉన్నారు. కానీ కేబినెట్ లో కూడా అనుకున్న విధంగా శాఖలను కేటాయించలేదని కొందరు తమ అసంతృప్తిని వెళ్లగక్కడం స్టార్ట్ చేశారు.
పట్టుమని నెల కూడా కాలేదు సీఎం అయి అప్పుడే తల పట్టుకునే పరిస్థితి ఎదురు కావడంతో బొమ్మైకి బొమ్మపడుతోంది. ముఖ్యంగా ముగ్గురు మంత్రులు మాత్రం మాకు అనుకున్న శాఖలు ఇవ్వలేదని అక్కసు వెళ్లగక్కుతున్నారని తెలుస్తోంది. ఏకంగా మీడియా ముఖంగా సీఎంపై విమర్శలు చేయడంతో బొమ్మై పరిస్థితి దారుణంగా తయారయింది. వీరిలో ఒక మంత్రి అయితే నాకు చెప్పిన శాఖ ఇస్తానని చెప్పి మాట తప్పారని డైరెక్ట్ గా చెప్పేశారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం వీరిలో ఒకరు త్వరలోనే రాజీనామా చేసేలా ఉన్నారని వినికిడి. ఇలాంటి పరిస్థితుల్లో అంతగా అనుభవం లేని బొమ్మై ఎలా వీటిని అణుచుకుంటూ ముందుకు వెళతాడో ముందు ముందు తెలియనుంది.
ఈ విషయంలో యడ్డ్యూరప్ప పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. దీనిని బట్టి చూస్తుంటే కర్ణాటక బీజేపీలో ఎప్పుడూ శాపంగా ఉన్న విధంగా త్వరలోనే బొమ్మై సీఎం స్థానం నుండి దిగిపోతాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ప్రచ్ఛన్న పరిస్థితిపై బీజేపీ అధిష్టానం ఏ విధంగా తన నాయకులను శాంత పరుస్తుందో చూడాలి..