అది విశాఖపట్నంలోని పెందుర్తి నియోజకవర్గం ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంది వైసీపీ కి చెందిన అదీప్ రాజు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందట.. ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే తరువాత ఎన్నికల్లో గెలవరట. యువ నాయకుడు అయిన అదీప్ రాజు వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ గెలుపు విలువ తెలియని అదీప్ రాజు ప్రజల గురించి అంతగా పట్టించుకోలేదట, నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదట. కట్ చేస్తే మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో జనం తమ ఓట్లతో షాకిచ్చారట. అప్పుడు అర్ధమయింది ఎమ్మెల్యేకి ప్రజల్లోకి పోకుంటే రేపు ఎమ్మెల్యేగా ఓడించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అలెర్ట్ అయిపోయాడు. ఇప్పుడు నిత్యం నియోజకవర్గం అంతా తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ నెలలో ఎక్కువ రోజులు ప్రజలతోనే మమేకం అవుతున్నాడట.
తన నియోజకవర్గంలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించే దిశగా ముందుకు వెళుతున్నారట అదీప్ రాజు. ఇది ఒకరకంగా భవిష్యత్తు ప్రణాళిక అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ముందుగానే ఒక ప్రచారంలాగా అదీప్ రాజు చేస్తున్నాడని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సేవలు ఇలాగే కొనసాగితే ఓకే కానీ మళ్ళీ ఎన్నికలు అయిపోయాక, ప్రజల కంటికి కనబడకుంటే ఎమ్మెల్యేకు ఇబ్బంది తప్పక పోవచ్చని పలువురు అంటున్నారు. ఏది అయినా ఎమ్మెల్యే అదీప్ రాజు చేస్తున్నది మంచి పని, మిగతా నాయకులు సైతం ఇతనిని ఆదర్శముగా తీసుకుని ఎక్కువగా ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు చేసుకోవడం మంచిది.