కరోనా కోరల్లో చిక్కుకుంటోన్న ఏపీ... జర జాగ్రత్త?

VAMSI
గత రెండేళ్లుగా కరోనా ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ మహమ్మారి చేసిన భీభత్సం ఎందరో అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. చిన్న,పెద్ద,పేద, ధనిక అని తేడా లేకుండా వేల మంది ప్రాణాలు తీసిన ఈ మహమ్మారి 3 ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఈ ప్రపంచాన్ని విడచి పోనంటోంది. కొన్ని రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టగా ఇపుడు మళ్ళీ తన పంజా విసురుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాలు కొద్ది రోజుల నుండి కరోనా భయం వీడి కాస్త ప్రశాంతంగా ఉంటుండగా మళ్ళీ ఇపుడు వైరస్ వ్యాప్తి పెరుగుతుండటం అందరినీ కలవరపెడుతోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా కేసుల సంఖ్య మెల్ల మెల్లగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గడచిన 24 గంటల్లో ఆంధ్రలో మొత్తం 28,855 మందికి పైగా కరోనా పరీక్షలను నిర్వహించగా వారిలో 246 వ్యక్తులకు పాజిటివ్ గా అని నిర్దారణ అయ్యింది. ఇది కేవలం అధికారికంగా మాత్రమే తెలిసిన సంఖ్య, ఇంకా ఎక్కువ ఉంది ఉండవచ్చు. ఇక కేసుల పరంగా చూస్తే తాజా కరోనా గణాంకాల ప్రకారం ఏపిలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 80 కొత్త పాజిటివ్ కేసులు రిజిస్టర్ అవ్వగా, గుంటూరు జిల్లాలో 31 కేసులు మరియు చిత్తూరు జిల్లాలో మొత్తం 41 కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
ఇక గడిచిన 24 గంటల్లో 334 మంది కరోనా నుండి కోలుకుని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇళ్లకు వెళ్ళగా మరో నలుగురు కరోనా బాధితులు ప్రాణాలను కోల్పోయారు.  కాగా ఇప్పటి వరకు నేడు బులిటెన్ లెక్కల ప్రకారం మొత్తం  కరోనా మృతుల సంఖ్య 14,401కి చేరింది. ఇక రాష్ట్రంలోని కరోనా గణాంకాలను చూస్తే ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  ఇప్పటి వరకు మొత్తం 20,68,487 పాజిటివ్ కేసులు రిజిస్టర్ కాగా...అందులో 20,50,720 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. ప్రస్తుతం 3,366 మంది చికిత్సను అందుకుంటున్నారు. ఇక ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే థర్డ్ వేవ్ కు సిద్ధం కావాల్సిందే అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: