రియల్ హీరో.. చనిపోతూ బ్రతికించాడు?
తమ కొడుకు చనిపోయాడు అని బాధ ఆ తల్లిదండ్రులకు ఉన్న తమ కొడుకు కారణంగా ఐదు మంది పునర్జన్మ పొందారు అన్న ఆనందం ఆ తల్లిదండ్రులకు మిగిల్చాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందిన 19 ఏళ్ల విద్యార్థి ఐదుగురు జీవితాల్లో వెలుగులు నింపాడు. తమిళనాడులోని చెన్నైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చెన్నై శివార్లలోని ఆర్కె రియల్ గ్రాండ్ ట్రంక్ రోడ్డుపై నెల రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో చెన్నైకి చెందిన విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డాడూ. అతని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అతన్ని బతికించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా చివరికి ప్రయత్నాలు ఫలించలేదు. బ్రెయిన్ డెడ్ కావడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అయినప్పటికీ అతని అవయవాలు పని చేస్తున్నాయని వైద్యులు చెప్పారు. యువకుడి కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు వైద్యులు. ఇక కుటుంబ సభ్యులు కూడా తమ కొడుకు అవయవాలు దానం చేసేందుకు సిద్ధమయ్యారు. అక్కడ చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులకు కిడ్నీ, గుండె అమర్చారు. ఇక మరో ముగ్గురికి ఒక కిడ్నీ రెండు ఊపిరితిత్తులు, కాలేయం అమర్చారు వైద్యులు. అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు..