ఇజ్రాయిల్ దేశం గాజాపై దాడులు తీవ్ర తరం చేసింది. ఇజ్రాయిల్ పౌరులు బందీలుగా ఉన్న వారిని విడిచిపెడితేనే యుద్ధం ఆపుతామని ఇజ్రాయిల్ ప్రకటిించింది. ఈ విషయంలో అమెరికా కూడా చేతులెత్తేసింది. అయితే గల్ప్ దేశాలు ఖతర్, ఈజిప్టు, ఇరాన్ లాంటి దేశాలతో మధ్య వర్తిత్వం వహించేందుకు చైనా ముందుకొచ్చింది. అగ్రరాజ్యం వల్ల కాని విషయాన్ని చైనా తాము చేసేందుకు సిద్ధమని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.


ముఖ్యంగా ఇరాన్ కు సౌదీ అరేబియాకు అస్సలు పడదు. వారు ఎప్పుడూ  నిప్పు ఉప్పులా ఉంటారు. అలాంటి వారిని ఏకం చేయడంలో చైనా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇరాన్ తో గొడవలకు కారణం హిజ్బుల్లా, హౌతీ, హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తూ తమ దేశాలపైకి ఉసిగొల్పుతుంది. దీని వల్ల పశ్చిమాసియా దేశాల్లో ఉగ్రవాదం ఎక్కువగా పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


అయితే చిట్ట చివరి ఇజ్రాయిల్ బందీలు బయటపడే వరకు తాము యుద్ధాన్ని ఆపేది లేదని బెంజిమన్ నెతన్యహు ప్రకటించారు. అయితే హమాస్ కూడా బందీలను విడిచిపెట్టమని కరాఖండిగా చెప్పింది. ఇందులో సామాన్య ప్రజలకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇలా ఇబ్బందులు పడుతున్న వారిని చూసి ఐక్యరాజ్య సమితి చలించిపోతుంది. వారికిి కనీసం తాగడానికి నీరు, తినడానికి తిండి అయినా ఇచ్చేలా చూడాలని ఇజ్రాయిల్ ను కోరింది.


దీనికి ఇజ్రాయిల్ సమ్మతించినా కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తోంది. అదే సమయంలో గల్ప్ దేశాల మధ్య సఖ్యత కుదర్చి ఇబ్బందులు తొలగించేలా చైనా పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఈ మధ్య ఇరాన్, గల్ప్ దేశాల మధ్య చర్చలు జరిపించింది. తద్వారా పశ్చిమాసియా ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని తహతహలాడుతుంది. మరి ఈ విషయంలో అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి. మొత్తం మీద చైనా కూడా తన ఉనికిని చాటు కోవాలని ప్రయత్నం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: