కనీస మద్దతు ధరకు చట్టబద్ధత  కల్పించాలని చేస్తున్న రైతు ఉద్యమానికి తాత్కాలిక  విరామం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంతో వారు జరుపుతున్న చర్చలు సఫలం కావడం లేదు. వారి డిమాండ్లు నెరవేరుతాయా.. అన్ని పంటలకు ఒకే విధానం అమలు చేయడం సాధ్యమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రకటించిన 23 పంటలకు కనీస మద్దతు ధర అమలు చేస్తే దాని ప్రభావం ఇతర అంశాలపై ముఖ్యంగా ఆర్థిక రంగంపై ఏ విధంగా ఉంటుందనేని కొంతమంది వాదన.


2024 రైతు ఉద్యమంలో ఉద్దృతి తక్కువే. కానీ ప్రశ్నలు ఎక్కువ. మూడు రైతు సంస్కరణ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్నా.. రైతుల పేరిట జరగుతున్న ఉద్యమాలు ఆగం లేదు. కేవలం రెండు రాష్ట్రాల పంజాబ్, హరియాణా రైతులే  ఇందులో ఎందుకు పాల్గొంటున్నారు. కేంద్రం చర్చలకు పిలిచిన ప్రతి సారి డిమాండ్లు ఎందుకు మారుతున్నాయి. అసలు చర్చలు  సఫలమయ్యే దిశగా వారి డిమాండ్లు ఉన్నాయా..?


ఎన్నికల ముందు మొదలైన చలో దిల్లీ రైతు ఉద్యమం బీజేపీ విజయావకాశాలపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది. కేవలం బీజేపీ ని దెబ్బతీయడంతో పాటు మోదీ ప్రతిష్ఠను దిగజార్చడమే లక్ష్యం అంటూ ఓ రైతు మాట్లాడిన వీడియో బయటకు రావడం ఇలా పలు అనుమానాలు, ప్రశ్నలను ఈ ఉద్యమం మిగిల్చింది.


రైతు ఉద్యమం అంటే రైతులకు సాయ పడాలి. జాతి వ్యతిరేక శక్తులకు కాదు. ఐదు పంటలకు మద్దతు ధరను ఐదేళ్ల పాటు అమలు చేస్తామని కేంద్రం బృందం హామీ ఇచ్చింది. మొదట ఒప్పుకున్నట్లే ఒప్పుకొని.. ఇప్పుడు పంటల సంఖ్యను పెంచడం వెనుక ఆంతర్యం ఏంటి. ప్రస్తుతం ఈ ఉద్యమాల వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని కొంతమంది వాదన.. రైతు సమస్యల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని కొన్ని పార్టీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ వాయిదా పడగానే రైతులు తమ ఉద్యమాన్ని వాయిదా వేసుకున్నారు. మళ్లీ ఎన్నికల ప్రకటన వెలువడతాయనే సంకేతాలు వచ్చిన సమయంలో రైతులు తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: