వైసీపీకి కీల‌క‌మైన రెడ్డి సామాజిక వ‌ర్గంలో చీలిక‌లు వ‌స్తున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. జ‌గ‌న్ కోసం.. జ‌గ‌న్ చేత ప‌రిత‌పించిన రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని ఆయ‌న త‌న సొంతం చేసుకోలేక పోయారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వ‌ర్గంలో పేరున్న నాయ‌కుల‌కు కూడా ఆయ‌న ప్రాధాన్యం లేకుండా చేసుకున్న ద‌రిమిలా.. రెడ్డి వ‌ర్గం వైసీపీకి దూర‌మైంది. నెల్లూరు జిల్లాలో ఒక‌ప్పుడు వైసీపీకి అంద‌లం వేసిన రెడ్లు.. ఇప్పుడు టీడీపీకి ప‌ట్టు పాన్పు ప‌రిచారు. ఫ‌లితంగా కంచుకోట‌లు కూలిపోయాయి.


ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వంటి పెద్ద రెడ్డిని జ‌గ‌న్ అవ‌మానించ‌క‌పోయి ఉంటే.. కొంత వ‌ర‌కు రెడ్లు శాంతించే వారు. ఇదేస‌మ‌యంలో రెడ్డి వ‌ర్గం దూరం పెట్టిన సాయిరెడ్డి వంటివారిని జ‌గ‌న్ త‌గ్గించి ఉన్నా ప‌రిస్థితి వేరేగా ఉండేది. ఇక‌, రాయ‌చోటి నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న శ్రీకాంత రెడ్దికి ప్రాధాన్యం ఇచ్చి ఉంటే.. కొంత వ‌ర‌కు మేలుగా ఉండేది. కానీ, జ‌గ‌న్ ఈ ప‌నులు చేయ‌లేక‌పోయారు. త‌న చుట్టూ.. త‌నే ఒక రెడ్డి కోట‌రీని నియ‌మించుకున్నారు.


ఆ రెడ్ల‌ను ఇత‌ర రెడ్లు సానుకూలంగా ఆలోచించ‌లేక పోయారు. దీనికి కార‌ణం.. జ‌గ‌న్ చుట్టూ ఉన్న రెడ్లు కూడా.. వ్య‌వ‌హ‌రించిన తీరు. రెడ్ల‌కు ప్రాధాన్యం ఇస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్ అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆ వ‌ర్గాన్ని దూరం చేసుకున్నారు. ఇక‌, టీడీపీ అధినేత‌ను చూసుకుంటే.. చంద్ర‌బాబు మావాడు అనే భావ‌న‌.. క‌మ్మ సామాజిక వ‌ర్గంలో క‌లిగింది. ఇది శాశ్వ‌తంగా నిలిచిపోయింది. అందుకే ఎన్నిక‌ల స‌మ‌యంలో అంద‌రు క‌మ్మ‌లు ఏక‌మ‌య్యారు. ఈ ప‌రిణామం .. జ‌గ‌న్ కు రాలేదు.


రెడ్డి సామాజిక వ‌ర్గం ఓన్ చేసుకున్న 2014లో 67, 2019 లో 151 సీట్లు ద‌క్కించుకున్న జ‌గ‌న్‌.. ఆ వ‌ర్గం దూర మ‌య్యాక‌.. కుదేల‌య్యారు. ఇది చిన్న విష‌యం కాదు. పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు ప్రాధాన్యం పెంచుతూ పోయి.. జ‌న‌ర‌ల్ స్థానాల్లోనూ రెడ్ల‌కు అవ‌కాశం లేకుండా చేయ‌డం, వారి వ్యాపారాల‌కు ఏమాత్రం ప్రోత్సాహం ఇవ్వ‌క‌పోవ‌డం వంటివి జ‌గ‌న్‌కు పెను శాపంగా మారాయి. ఇది అంతిమంగా.. జ‌గ‌న్‌కు ఇబ్బంది అయింది. వాస్త‌వానికి ఈ విష‌యంపై మీడియా రెండేళ్ల కింద‌టే హెచ్చ‌రించింది. అయినా.. జ‌గ‌న్ మార‌లేదు., మ‌రి ఇప్పుడైనా మారుతారా?  అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: