* వైసిపి అభ్యర్థికి సపోర్ట్ గా బన్నీ ప్రచారం
* మెగా హీరోలు వర్సెస్ అల్లు అర్జున్ మధ్య సోషల్ మీడియా వార్
* పుష్ప సినిమాలో బన్నీ పాత్ర పై పవన్ కళ్యాణ్ సీరియస్
* నాకు నచ్చినట్లే ఉంటా.. నాకు నచ్చింది చేస్తానని బన్నీ ప్రకటన
* రోజురోజుకు పెరుగుతున్న అల్లు అర్జున్, మెగా వార్



ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో.. రాజకీయాల వేడి కంటే అల్లు అర్జున్ వర్సెస్ మెగా కుటుంబం మధ్య జరుగుతున్న విభేదాలు ఎక్కువగా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఏ ఛానల్ పెట్టిన ఏ న్యూస్ విన్నా... మొట్టమొదటగా అల్లు అర్జున్ వర్సెస్ మెగా కుటుంబం మధ్య ఉన్న గొడవలు గురించే చర్చలు అలాగే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ మెగా రచ్చకు దారితీసింది అల్లు అర్జున్ అని కొంతమంది అంటున్నారు.


మొన్న జరిగిన 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్..వైసీపీకి సపోర్ట్ గా ప్రచారం చేశారు. శిల్పా రవి కిషోర్ గెలుపు కోసం.. రంగంలోకి దిగిన అల్లు అర్జున్ ఎన్నికల కంటే ముందు రోజు కూడా ప్రచారం చేశారు.  కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం మాత్రం అల్లు అర్జున్ వెళ్లలేదు. అయితే... పవన్ కళ్యాణ్ కు బద్ధ శత్రువు అయిన జగన్ పార్టీకి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంపై... మెగా కుటుంబ సభ్యులు చాలా సీరియస్ అవుతున్నారు.


నాగబాబు మరియు సాయిధరమ్ తేజ్లు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పై విరుచుకుపడ్డారు. అటు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య రచ్చ జరుగుతుంది. ఇక లేటెస్ట్ గా పుష్ప సినిమాలో.. అల్లు అర్జున్ పాత్రను కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. ఎర్రచందనం దొంగిలించేవారు పెద్ద దొంగ అంటూ కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్.


అయితే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కు తాజాగా అల్లు అర్జున్ కూడా పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. నాకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తాను... నా అనుకునే వాళ్లకోసం ఎక్కడికైనా వెళ్లి... పనిచేస్తానని అల్లు అర్జున్ ప్రకటించారు. దీంతో మెగా కుటుంబం వర్సెస్ అల్లుఅర్జున్ మధ్య వివాదం మరింత తారస్థాయికి చేరింది. తాజాగా జనసేన ఎమ్మెల్యే  బొలిశెట్టి శ్రీనివాస్ కూడా అల్లు అర్జున్ పై కామెంట్స్ చేశారు.అల్లు అర్జున్ కు ఎక్కడ ఫాన్స్ లేరని... ఆయనకు ఉన్నది మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: