* ముగ్గురు మంత్రులు అలర్ట్ గా లేకపోవడమే పెద్ద నష్టం
* రిటైనింగ్ వాల్ పూర్తి చేస్తే ఖమ్మం సేఫ్
రెండు తెలుగు రాష్ట్రాలలో గత వారం రోజులుగా విపరీతంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత శనివారం నుంచి... ఇవాల్టి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు చాలా గట్టిగానే కొడుతున్నాయి. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం పై భాగాలలో కూడా వర్షాలు పడుతున్నాయి. దీనివల్ల గోదావరి అటు కృష్ణా నదులు ఉధృతంగా ప్రవహించి చాలా నగరాలకు వరదలు వస్తున్నాయి.
ఈ తరుణంలోనే ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు... బీభత్సంగా ప్రవహిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మున్నేరు ప్రవహించడం జరుగుతోంది. ముఖ్యంగా ఆదివారం కురిసిన వర్షానికి... మున్నేరు ఉప్పొంగి ఖమ్మం నగరానికి వరద వచ్చింది. దీనివల్ల ఖమ్మంలోని చాలా కాలనీలు నీట మునిగాయి. దీంతో ఖమ్మం పట్టణ ప్రజలు... తీవ్రంగా నష్టపోయారు. వరదల్లో కూడా మునిగి చాలా మంది మరణించడం జరిగింది.
గతంలో చాలాసార్లు ఖమ్మం పట్టణానికి వరద వచ్చింది. కానీ ఇంత స్థాయిలో ఎప్పుడు రాలేదని ఖమ్మం ప్రజలు చెబుతున్నారు. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు... భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు... ఈ వర్షాలపై అలర్ట్ లేకపోవడంతో ఖమ్మం ప్రజలకు చాలా నష్టం చేకూరిందని చెబుతున్నారు. ఇప్పటికీ కూడాసహాయం అందలేదని ప్రజలు చెబుతున్నారు.
కానీ గులాబీ పార్టీ నేతలు మాత్రం అన్ని.. సౌకర్యాలు కల్పించి వారికి ఆహార పదార్థాలను అందిస్తున్నారు. అయితే ఖమ్మం పట్టణానికి ఇలా వరదలు రాకుండా.. కెసిఆర్ ప్రభుత్వం లోనే రిటైనింగ్ వాల్ కోసం... ఫండింగ్ కూడా రిలీజ్ అయింది. పనులు దాదాపు 50% వరకు పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. వెంటనే పనులు ప్రారంభమై... రిటైనింగ్ వాల్ కడితే కచ్చితంగా ఖమ్మం పట్టణాన్ని కాపాడుకోవచ్చు అని చెబుతున్నారు.