- దేవినేని అవినాష్‌కు ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్య‌క్ష ప‌గ్గాలు
- దేవ‌భ‌క్తుని చ‌క్ర‌వ‌ర్తికి పెన‌మ‌లూరు ఇన్‌చార్జ్ ప‌ద‌వి
- వైసీపీ లో తొలి క‌మ్మ జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా అవినాష్ రికార్డ్

- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) .


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఎప్పుడు లేనట్టుగా కమ్మ సామాజిక వర్గం పై అమితమైన ప్రేమ పుట్టుకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలి అంటే వైసీపీలో ముందు నుంచి కమ్మ సామాజిక వ‌ర్గానికి ఎంత మాత్రం ప్రాధాన్యత లేకోకుండా పోయింది. మొన్న ఎన్నికలలో కూడా జగన్ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి కేవలం 9 ఎమ్మెల్యే సీట్లతో పాటు అప్పటికప్పుడు పార్టీ మరియు వచ్చిన విజయవాడ ఎంపీ కేశినేని నానికి మాత్రమే టికెట్ ఇచ్చారు. ఎన్నో సామాజిక‌ వర్గాలకు ఎన్నో పదవులు కట్టబెట్టిన జగన్ వైసీపీలో కమ్మ నేతలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేశారు.


జగన్ కోసం ఎంతో త్యాగం చేసిన కొడాలి నాని కి కూడా తొలి మూడేళ్లు మాత్రమే మంత్రి పదవి ఇచ్చి తర్వాత ప్రక్షాళ‌న‌లో పీకి పడేశారు. అసలు వైసీపీలో ఇప్పటివరకు రాజ్యసభ నుంచి ఒక క‌మ్మ‌ ఎంపీ కూడా లేరు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 26 జిల్లాలకు అధ్యక్షులను ఎంపిక చేసిన కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరికి కూడా అవకాశం లేదు. అయితే ఎట్టకేల‌కు ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక యువ నేతకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి దక్కింది. అది కూడా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన యువనేత దేవనేని అవినాష్‌ను ఎంపిక చేశారు.


ఇప్పటివరకు ఈ పదవులు ఉన్న జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పార్టీ మరి జనసేనలోకి వెళ్లిపోయారు. దీంతో వైసీపీలో జిల్లా అధ్యక్ష పదవికి ఎంపికైన తొలి కమ్మ సామాజిక వర్గ నేతగా అవినాష్ రికార్డులకు ఎక్కారు. ఇక గత ఎన్నికలలో బీసీలకు ఇచ్చిన పెనమలూరు ఇన్చార్జ్ బాధ్యతలను కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన కమ్మ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవభక్తుని చక్రవర్తికి ఇచ్చారు. ఏది ఏమైనా జగన్కు ఇటీవల కాలంలో కమ్మ సామాజిక వర్గం పై కాస్తంత ప్రేమ కనిపిస్తోంది. మరి ఇది వచ్చే ఎన్నికల వరకు ఉంటుందా ? లేదా జగన్ తన పంథా తనదే అంటారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: