- వైఎస్సార్ సీపీలో కొత్త ప‌ద‌వుల భ‌ర్తీ చేస్తోన్న జ‌గ‌న్‌
- మంత్రి లోకేష్ పై కొత్త ప్ర‌త్య‌ర్థి ప్ర‌క‌ట‌న‌
- గ‌త ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిన లావ‌ణ్య‌ను ప‌క్క‌న పెట్టేసిన వైనం
- మంగ‌ళ‌గిరి వైసీపీ కొత్త ఇన్‌చార్జ్‌గా దొంతిరెడ్డి శంక‌ర్ రెడ్డి

- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పలు నియోజకవర్గాలలో కొత్త ఇన్చార్జిలను నియమిస్తూ వస్తున్నారు. అలాగే చాలా జిల్లాలకు కొత్త పార్టీ అధ్యక్షులను నియమిస్తూ వస్తున్నారు.. తాజాగా బుధవారం రాత్రి వైఎస్ఆర్సిపి లో పదవుల భర్తీ జరిగింది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ యువనేత .. జాతీయ ప్రధాన కార్యదర్శి .. మంత్రి నారా లోకేష్ ప్రాథినిత్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి వైసీపీ నుంచి కొత్త ఇన్చార్జి ను నియమించారు. వాస్తవానికి ఇక్కడ 2019 ఎన్నికలలో లోకేష్ పై పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్లోకి వెళ్లి తిరిగి వైసిపి గూటికి చేరారు.


జగన్ ఆయనకు సీటు లేదని ముందే చెప్పడంతో ఆళ్ళ ఇలా చేశారు. ఇక ఎన్నికలలో బీసీ పద్మశాలి వర్గానికి చెందిన మురుగుడు లావణ్య కు అవకాశం ఇచ్చారు. ఆమె గత ఎన్నికలలో లోకేష్ చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. లోకేష్ పై బీసీ అస్త్రం ప్రయోగించి ఓడించాలని చూసిన జగన్కు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పారు. లొకేష్ ను ఏకంగా 92,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారు. ఇక ఇప్పుడు మార్పులు చేర్పులలో భాగంగా జగన్ లావణ్యను పక్కన పెట్టేశారు.


మంగళగిరి వైసీపీ కొత్త ఇన్చార్జిగా దొంతి రెడ్డి శంకర్ రెడ్డిని నియమించారు. 2014 - 2019 ఎన్నికలలో మంగళగిరి సీటును వైసీపీ గెలుచుకున్నప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి జగన్ టికెట్ ఇచ్చారు. 2019లో పార్టీ ఓడిపోయినప్పుడు బీసీ మహిళ నేతను దింపి బలి పశువుని చేశారు. ఇప్పుడు ఆమెను తెలివి గా పక్కకు పంపేసి తిరిగి రెడ్డి వర్గానికి చెందిన దొంతి రెడ్డి శంకర్ రెడ్డికి ఇన్చార్జి పగ్గాలు అప్పగించారు. మరి ఈ మార్పు మంగళగిరిలో పార్టీని ఎంతవరకు బలోపేతం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: