- ప‌ల్నాడు జిల్లాకు చెందిన స‌త్తెన‌ప‌ల్లి ప‌గ్గాలు కాకుండా గుంటూరు జిల్లా ప‌గ్గాలు అప్ప‌గింత‌
- స‌త్తెన‌ప‌ల్లి లో వైసీపీకి కొత్త ఇన్‌చార్జ్ వ‌స్తున్నారా ?
- అందుకే అంబ‌టిని గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియ‌మించారా ?
- పొన్నూరు లో అంబ‌టి సోద‌రుడు ముర‌ళీకి కూడా షాక్ త‌ప్ప‌దా ?


- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) .


వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చీటీ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చింపేస్తున్నారా ? ఆయనను త్వరలోనే సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జి పదవి నుంచి తప్పించబోతున్నారా ? ఇందుకు అనుకూలంగానే సంకేతాలు ఇచ్చేసారా ? తాజాగా వైఎస్ఆర్సిపి లో జరిగిన పదవుల పంపిణీ మార్పులు .. చేర్పులలో భాగంగా అంబటి రాంబాబును గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించడం వెనక కూడా జగన్ సంకేతాలు ఇచ్చేసారా ? అంటే గుంటూరు జిల్లా వైసీపీ రాజకీయ వర్గాలలో ఇదే ప్రచారం జరుగుతుంది.


అంబటి రాంబాబు ఇన్చార్జిగా ఉన్న సత్తెనపల్లి పలనాడు జిల్లా పరిధిలోకి వస్తుంది. పల్నాడు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్మెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ కొద్ది రోజుల క్రితం నియమించారు. పల్నాడు జిల్లా పరిధిలో సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఉంటే ... జగన్ మాత్రం అంబటి రాంబాబును అనూహ్యంగా పల్నాడు జిల్లాకు కాకుండా గుంటూరు జిల్లాకు వైసిపి అధ్యక్షుడిగా నియమించారు. ఇక త్వ‌ర‌లోనే స‌త్తెన‌ప‌ల్లికి వైసీపీ నుంచి కొత్త ఇన్‌చార్జ్ వ‌స్తార‌ని అంటున్నారు. ఓ క‌మ్మ నేత పేరు కూడా ప‌రిశీల‌న‌లో ఉంద‌ట‌. ఇక త్వ‌ర‌లోనే అంబ‌టి రాంబాబు సోద‌రుడు అంబ‌టి ముర‌ళీని కూడా పోన్నూరు ఇన్‌చార్జ్ ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తార‌ని టాక్ ?  అదే జ‌రిగితే ఒకేసారి అంబ‌టి బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రికి జ‌గ‌న్ మార్క్ షాక్ త‌ప్ప‌ద‌నే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: