రాయలసీమ గడిచిన ఆరు దశాబ్దాలుగా అన్యాయంతో ఆక్రోశిస్తోంది. మేము రాము మొర్రో అని చెప్పినా వినకుండా కోస్తా ప్రాంతాల వారుతమతో పాటు ఉమ్మడి మద్రాస్ స్టేట్ నుంచి రాయలసీమ జిల్లాలను ఆంధ్ర రాష్ట్రం వైపు తీసుకొని వచ్చారు. అయితే మాకు మద్రాస్ స్టేట్ తోను సుఖంగా అని చెప్పారు రాయలసీమ పెద్దలు. అలా కాదు.. మనసంతా ఒక్కటీ అని నచ్చజెప్పారు. మాకు ఫ్యూచర్ గ్యారంటీ ఏంటి అంటే శ్రీభాగ్ ఒడంబడిక అని పెద్ద మనుషులతో కోస్తా సీమ ప్రాంతాల వారు కలిసి కుదర్చుకున్నారు.


దాని ప్రకారం రాయలసీమకు రాజధాని స్తే కోస్తాకు హైకోర్టు అని అనుకున్నారు. అలాగే రాజధాని కోస్తాకు వెళ్తే సీమకు హైకోర్టు అని ఒడంబడిక కుదిరింది. అలా 1953 లో ఏపీ స్టేట్ ఏర్పడింది. అది పదకొండు జిల్లాలుగా ఆ తర్వాత కోస్తాలో మరో రెండు జిల్లాలు వచ్చాయి. కానీ సీఎం అలాగే పాత జిల్లాలతో ఉంది.


జగన్ సీఎం అయ్యాక సీమలో నాలుగు జిల్లాలు డబుల్ అయ్యాయి. ఇది వేరే విషయం. 2014లో ఏపీ పునర్విభజన జరిగింది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టును ఇవ్వాలని రాయలసీమ వాసులు కోరుతూనే ఉన్నారు. టీడీపీ తొలి టెర్మ్ లో ఏమీ కాలేదు. జగన్ అయితే హైకోర్టుతో న్యాయ రాజధాని చేస్తామని అన్నారు. కానీ అచరణలో అడుగు ముందుకు పడలేదు.


ఇప్పుడు టీడీపీ కూటమి సీమకు అంతో ఇంతో న్యాయం చేసేందుకు రెఢీ అవుతుంది.  సీమకు హైకోర్టు బెంచ్ ని గిఫ్ట్ గా ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టేందుకు తొందర్లోనే మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేస్తామని చెప్పారు. ఆ మీదట ప్రతిపాదనను కేంద్రానికి పంపుతామని ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ కూటమి ఉంది. దీంతో పాటు హైకోర్టు బెంచ్ అన్నది బీజేపీ 2019 ఎన్నికల్లో సీమకు ఇచ్చిన హామీల్లో ఉంది. మొత్తానికి అయితే హైకోర్టు బెంచ్ అనేది సీమకు గ్యారంటీగా రాబోతుంది అని భావించవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: