గత వారం రోజుల నుంచి వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారు అనే విధంగా కూటమి ప్రభుత్వం వాదనలను వినిపిస్తోంది. ఈ విషయాలన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఈ రోజున వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన చేపడుతున్నారని తెలిసి చాలా ఉత్కంఠంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మారాయి. ఈరోజు సాయంత్రం 4: 50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి రాబోతున్నారని అనంతరం రోడ్డు మార్గంలోని తిరుమలకు వెళ్లి రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకోబోతున్నారని రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోబోతున్నారట మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి.


అయితే ఇలాంటి తరుణంలోనే కూటమి నేతలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా వైసిపి నేతలు ఆరోపిస్తూ ఒక సంచలన ట్విట్ ని షేర్ చేశారు. ఈ విషయం అటు వైసీపీ నేతలను ఆందోళనలో పడివేసింది. ఈ ట్విట్ లో ఏముందంటే బిజెపి నేత భాను ప్రకాశ్ రెడ్డి, జనసేన నేత కిరణ్ రాయల్ టిడిపి నేతలు డబ్బులు ఇచ్చి మరి కొంతమంది గుండాలను తిరుపతిలో ఉంచినట్లుగా సమాచారం అందుతుందని జగన్ వాహనం పైకి గుడ్లు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఇప్పటికే మనుషుల్ని పురాయించినట్లుగా తెలుస్తోంది అంటూ తెలిపారు.


తిరుమల లడ్డు వ్యవహారంలో కూటమి ప్రభుత్వం బండారం బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారన్నట్టుగా ఒక ట్విట్ షేర్ చేసింది వైసిపి సోషల్ మీడియా. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుపతికి రాబోతున్నారని తెలిసి కూటమినేతలు ఒక హోటల్లో సమావేశం జరిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నట్లుగా సమాచారం. కడప జిల్లాలో కూడా తనిఖీలు ఎక్కువగా పోలీసులు చేపట్టారు కడప జిల్లా నుండి తిరుపతికి వైసీపీ నేతలు కార్యకర్తలు రాకుండానే అడ్డుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో సాయంత్రం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: