ప్రస్తుతం దేశవ్యాప్తంగా అదాని ఇష్యూ వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఆదాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అమెరికాలోని కోర్టు కూడా ఆయనను అరెస్టు చేయాలని వారెంట్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఆదానిపై  ఉన్న కేసు జగన్మోహన్ రెడ్డికి.. పెను ప్రమాదంగా మారింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాని కంపెనీతో.. చాలా ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో... అదాని నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.


దీనికి తగ్గట్టుగానే టిడిపి కూటమి ప్రభుత్వం కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారు.అయితే ఇలాంటి నేపథ్యంలో.. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదాని నుంచి ఎవరు డబ్బులు తీసుకున్న వారిని అరెస్టు చేయాల్సిందే అంటూ... తాజాగా మీడియాలో పేర్కొన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా తెరపైకి వస్తుందని అక్కడ ఉన్న జర్నలిస్టులు కేటీఆర్ ను ప్రశ్నించారు.


అదాని కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా... చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డిని ఇరికించే ప్రయత్నంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్.. వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా వెనక్కి తగ్గలేదు. ఆ దాని కేసులో ఎవరు లంచం తీసుకున్న కూడా వారిని వదిలేది లేదని... కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్.


రాహుల్ గాంధీకి కూడా ఛాలెంజ్ విసిరారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు.  అదానిపై రాహుల్ గాంధీ చేసే వ్యాఖ్యలను ఈ దేశ ప్రజలు నమ్మాలంటే.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అదాని ఒప్పందాల్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు.  తన సీఎంలకు ఫోన్ చేసి.. MOUలను క్యాన్సిల్ చేయాలని చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేయడం జరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: