- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) . .

ఒకే ఒక్క ఓటమితో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది. పలుచోట్ల మంత్రులు, మాజీ మంత్రులు.. జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోతున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది. మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్.. అసలు ఎన్నికల్లోనే పోటీ చేయనని.. పోటీ నుంచి తప్పుకున్నారు. ఏలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ‌నాని.. పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన స్థానంలో కొత్తగా వచ్చిన మామిళ్ల‌ప‌ల్లి జయప్రకాష్ అంత యాక్టివ్గా కనపడటం లేదు. పైగా వైసీపీలో అంత బలమైన నేత కూడా కాదు.


దెందులూరు లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే.. కొఠారు అబ్బయ్య చౌదరి ఓటమి తర్వాత పార్టీ కెడ‌ర్‌ను పూర్తిగా గాలికి వదిలేసి.. విదేశాలకు వెళ్లిపోయి ఇటీవల తిరిగి వచ్చారు. పోలవరంలో ఓడిపోయిన తెల్లం రాజ్యలక్ష్మి అంత యాక్టివ్‌గా లేరు. కైకలూరులో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును.. ఏకంగా ఎవరు గతిలేకపోవడంతో ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఆయన నియోజకవర్గానికి చాలా ఎక్కువ. అలాంటిది జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఏం చేస్తారు.. ?


ఇక ఉంగుటూరులో ఘోరంగా ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే మాజీ జిల్లా పార్టీ అధ్యక్షుడు పుప్పాల వాసు బాబు ఏమాత్రం యాక్టివ్ గా లేరు. నూజివీడులో ఉన్నంతలో మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్, అప్పారావు కాస్త బెటర్. చింతలపూడిలో ఓడిపోయిన ఇన్చార్జి కంభం విజయరాజు కూడా ఉన్నంతలో కాస్త యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పటికే ఏలూరు ఇన్చార్జి మారిపోయారు. పోలవరంలో కూడా రాజ్యలక్ష్మిని తప్పించి మాజీ ఎమ్మెల్యే బాలరాజుకు ఇన్చార్జ్ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా జిల్లావ్యాప్తంగా ఒక్కరంటే ఒక్కరు కూడా పార్టీలో అంత యాక్టివ్‌గా కనిపించని పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: