కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా జమిలి ఎన్నికల పైన కసరత్తు చేస్తున్నదని ఈ నెల 26 నుంచి ప్రారంభమై పార్లమెంట్ సీతకాల సమావేశాలలో సైతం ఈ బిల్లును తీసుకువచ్చేలా చూస్తున్నారని.. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం కావడం చేత ఈ అంశం పైన చర్చించామని తెలిపారు చంద్రబాబు. హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఎన్డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నప్పుడు ఆ వెంటనే జమిలికి మద్దతు వ్యాఖ్యలను కూడా తెలియజేశారు. దీంతో 2027 లో ఎన్నికలు జరుగుతాయని వార్తలు వినిపించాయి.
ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ దేశంలో జమిలి వచ్చిన రాష్ట్రంలో మాత్రం షెడ్యూల్ ప్రకారమే 2029 లో ఎన్నికలు జరుగుతాయి అంటూ తెలిపారు. అయితే జమిలి ఎన్నికల పైన కేంద్రం ఆలోచన ఏంటి అనే విషయం పైన పార్లమెంటు సమావేశాల తర్వాతే స్పష్టత వస్తుందని.. అంతేకాకుండా జమిలి ఎన్నికలకు ముందే జన గణన నియోజకవర్గం పునర్విభజన వంటివి పూర్తి చేయాల్సి ఉంటుంది అందుకే కేంద్ర ప్రభుత్వం 2029కే జమిలి ఎన్నికలు నిర్వహించేలా చూస్తుంది అంటూ తెలిపారు చంద్రబాబు. మరి కొద్ది రోజులలో జమిలి ఎన్నికల పైన స్పష్టత వస్తుందంటూ తెలిపారు. ఇప్పటికే వక్స్ బిల్లు పైన తమ పార్టీ ఎంపీలకు చంద్రబాబు సూచనలు ఇచ్చానని ముస్లిం వర్గాలకు సంబంధించిన వాటిని కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించానని వాళ్లు కూడా తొందరపడే అవకాశం లేదంటే తెలిపారని.. ఒకవేళ బిల్లు పెడితే ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తామని తెలిపారు చంద్రబాబు.